Home తాజా వార్తలు స్వామిగౌడ్‌కు కడియం పరామర్శ

స్వామిగౌడ్‌కు కడియం పరామర్శ

K

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన సోమవారం రోజే అవాంఛనీయ సంఘటన జరిగింది. గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మైక్ విసరడంతో అది శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలి స్వల్ప గాయమైంది. ఈ క్రమంలో స్వామిగౌడ్ సరోజిని దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వామిగౌడ్‌ను డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి సోమవారం సాయంత్రం పరామర్శించారు. స్వామిగౌడ్‌కు అందిస్తున్న చికిత్సపై ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Kadiyam Visitation to Swamygoud