*మూడున్నరేళ్ల పసికూనైనా దేశానికే ఆదర్శంగా తెలంగాణ
*కొత్త చెరువుకు దీటుగా రాయసముద్రం అభివృద్ధికి నిధులు
*ఎంఐజి, బిడిఎల్, మ్యాక్స్ సొసైటీ కాలనీలకు ఫైనల్ లేఔట్‌లు
*భారతినగర్ డివిజన్‌లో పర్యటనలో మంత్రి హరీష్‌రావు
*రూ.పదిన్నరకోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నాది తెలంగాణ రాష్ట్రం అని ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగ చెప్పుకునేలా చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మనందరం రుణపడి ఉన్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. రామచంద్రాపురం పరిధిలోని భారతీనగర్ డివిజన్‌లో దాదాపు పదిన్నర కో ట్ల రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ది పనుల కు శనివారం రాత్రి శంకుస్థాపన చేశారు. స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా మంత్రి హరీష్‌రావుతో పాటు మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, శేరిలిందగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం ఎల్‌ఐజీలో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం అందరికీ రాదని బాధ్యతలు బారంగా కాకుండా ప్రజలకు ఇష్టం గా సేవచేయాలన్నారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ కడుపులో బి డ్డను కాపాడినట్లు కాపాడుతున్నారన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్దిలో దూసుకుపోతుందని, తెలంగాణ రాష్ట్ర కేవ లం మూడున్నరేళ్ల పసిగుడ్డే ఐన మిగతా రాష్ట్రాలకు మనమే ఆదర్శమన్నారు. దేశం లో ఏక్కడలేని విధంగా రాష్ట్రంలో 24గంటల విద్యుత్‌ను అందించడం కెసిఆర్‌కే దక్కిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆదుకునేల సంక్షేమ పథకాలు రూపకల్ప న చేయడంమే కాకుండా అమలు చేయడం అంత సాధారణ విషయం కాదన్నా రు. సేవచేసే ముఖ్యమంత్రి దొరకడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. రామచంద్రాపురం రాయసముద్రం చెరువు సుందరీకరణకు ప్రత్యేక ని ధులు కేటాయించి కొత్త చెరువుకు ధీటుగా అభివృద్ధి పరుస్తానని, అదేవిధంగా అత్యాధునిక అన్ని వసతులతో స్మాశానవాటికను అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. అదేవిధంగా కాలనీ ఏర్పాటై ఏళ్లు గడుస్తున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యుత్‌నగర్, బిడిఎల్, మ్యాక్స్ సొసైటీ కాలనీలకు ఫైనల్ లేఔట్ ఏర్పాటు చేస్తామన్నా రు. పటాన్‌చెరువు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెల్తుంద ని, స్థానిక నాయకుల శ్రమతోనే అభివృద్ధి ఫలితాలు వస్తున్నాయని మంత్రి హరీష్‌రావు కొనియాడారు. కార్యక్రమంలో పటాన్‌చెరువు నియోజకవర్గం టిఆర్‌ఎస్ ఇన్‌ఛార్జ్ గాలి అనీల్‌కుమార్, పార్టీ రాష్ట్ర కార్యధర్శి సపాన్‌దేవ్, ఎంపిపిలు నలకంటి యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ పుష్పానాగే ష్, కార్పొరేటర్ తొంట అంజయ్య, రాగం నాగేందర్ యాదవ్, నాయకులు సో మిరెడ్డి, నాగేష్‌యాదవ్, మోహన్‌గౌడ్, ఆదర్శరెడ్డి తదితరులు పాల్గొన్నారు.