Friday, March 29, 2024

కాజల్ బ్యాచిలరేట్ పార్టీ ఫోటోలు వైరల్…

- Advertisement -
- Advertisement -

కరోనా లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా అక్టోబర్ 30న తన ఫ్రెండ్, ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది. అంతేకాదు, బ్యాచిలరేట్ పార్టీ కూడా ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను కాజల్ సెప్టెంబర్ లోనే అభిమానులతో పంచుకుంది. అయితే, ఇవి ఫ్రీ వెడ్డింగ్ ఫోటోలని ఎవరూ గుర్తుపట్టలేదు. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కాజల్ పెళ్లి గురించి జోరుగా వార్తాలు చక్కర్లు కొట్టాయి.ఈ నేపథ్యంలో స్పందించిన కాజల్ తన పెళ్లిని కన్ఫామ్ చేసింది. ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య ముంబైలో పెళ్లి జరగనుందని స్పష్టం చేసింది. దీంతో కాజల్-గౌతమ్ లకు అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Kajal Agarwal Bachelorette Party Photos Viral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News