Home గాసిప్స్ ‘ఇండియన్ 2’లోని పాత్రతో చందమామ షాక్ ఇవ్వనుందట..!

‘ఇండియన్ 2’లోని పాత్రతో చందమామ షాక్ ఇవ్వనుందట..!

Kajal Agarwalచెన్నై: టాలీవుడ్ చందమామ అంటే టక్కున గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. మూడు పదుల వయసు దాటిన ఇప్పటికి చెక్కుచెదరని అందం ఆమె సొంతం. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు కావస్తున్న కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా అవకాశాలు అందుకుంటుంది. 2007లో లక్ష్మీకళ్యాణంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కాజల్ ఆ తరువాత 2009లో వచ్చిన మగధీరతో స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ మూవీ తరువాత చందమామకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అలా దశాబ్దకాలంగా నేటితరం హీరోయిన్లకు సైతం గట్టిపోటినిస్తూ అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోందీ బ్యూటీ. అంతేగాక గతంలో ఎప్పుడు లేని విధంగా అమ్మడు వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సౌత్ లో దాదాపు అందరూ స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఇదిలాఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్న ‘భారతీయుడు 2’ సినిమాలో నటించే అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. అయితే, కెరీర్ లో ఇప్పటివరకు కాజల్ ఎప్పుడు కనిపించని విధంగా ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్ లో పూర్తి వైవిధ్యంగా కనిపించనుందని టాక్. ఇంకా చెప్పాలంటే ఆ పాత్రతో ఈ భామ ఆడియన్స్ కు షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది. దర్శకుడు శంకర్ చందమామ క్యారెక్టర్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసినట్లు సమాచారం.

ఆమె పాత్రను హాలీవుడ్ నుంచి మేకప్ నిపుణులతో రెడీ చేస్తున్నారట. కాజల్ ఫోటో షూట్ సైతం విదేశాల్లోనే ప్లాన్ చేశారట. ఇక ఈ ఆఫర్ తో కాజల్ ఉబ్బితబ్బిబవుతోందట. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన కెరీర్ మైలెేజీని పెంచుకునే పనిలో ఉందట ఈ చందమామ. అయితే, కాజల్ పాత్రను శంకర్ ఎలా చూపించబోతున్నాడనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక యంగ్ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ తో ఆమె నటించిన ‘కవచం’ మూవీ ఈ నెల 7న విడుదల కానుంది.