Saturday, April 20, 2024

కాజల్ హల్దీ వేడుక.. ఫోటోలు వైరల్

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన బ్యాచిలర్ జీవితానికి గుడ్‌బై చెప్పనుంది. శుక్రవారం ఈ చందమామ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహమాడనున్న విషయం తెలిసిందే. పెళ్లి పనులన్నీ కాజల్ సోదరి నిషా అగర్వాల్ దగ్గరుండి చూసుకుంటోంది. ఇప్పటికే కాజల్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా బుధవారం మెహెందీ ఫంక్షన్ నిర్వహించగా… గురువారం హల్దీ వేడుకను నిర్వహించారు. పసుపు రంగు దుస్తులు, పువ్వుల రూపంలో ఏర్పాటు చేసిన జ్యూవెల్లరీతో కాజల్ మెరిసిపోయింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. కొన్ని ఫొటోల్లో కాజల్ నవ్వూతూ తన మెహెందీ చేతులను చూపిస్తూ ఫోజ్ ఇచ్చింది. అలాగే హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోల్లో ఈ స్టార్ హీరోయిన్ మరింత అందంగా దర్శనమిచ్చింది.

 

Kajal Aggarwal Haldi Celebrations photos viral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News