Home తాజా వార్తలు తెలంగాణ జలవీణ

తెలంగాణ జలవీణ

 

కాళేశ్వరం ప్రారంభం 21న

రేయింబవళ్లు.. మూడు షిప్టులూ..
కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లూ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టుకు బంధించిన 12 బ్లాకుల్లో 1531 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వలు, 203 కిలోమీటర్ల మేర సొరంగాల పనులు రాత్రింబవళ్లూ సాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 4 వేల మందికి పైగా కార్మికులు నిరంతరం షిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు.

మన తెలంగాణ/హైదరాబాద్: ఉత్తర తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. ఈ నెల 21న ఉద యం 11 గంటలకు మేడిగడ్డ బ్యారే జీ వద్ద పంపుల స్విచ్ ఆన్ చేసి, ప్రాజెక్టును ముఖ్యమంత్రి కెసిఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ప్రాజెక్టు ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ముఖ్య అతిధిగా ఆహ్వానించాలని కెసిఆర్ నిర్ణయి ంచారు. ఇందుకోసం త్వరలోనే విజయవాడకు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి సిఎం జగన్‌ను ఆహ్వానించనున్నా రు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్‌తో కూడా సిఎం కెసిఆర్ ఫో న్‌లో మాట్లాడారు. కాళేశ్వరం ప్రారంభానికి ఆయనను ఆహ్వానించగా, సా నుకూలంగా స్పందించారు. ప్రాజెక్టు ప్రారంభానికి రావడానికి ఒప్పుకున్నారు. సిఎం కెసిఆర్ ముంబై వెళ్లి నేరుగా ఆహ్వానపత్రం అందిస్తారు. ముచ్చటగా ముగ్గురు ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రాజెక్టు ప్రారంభమైతే అంతర్రాష్ట్ర సంబంధాల్లో ఇదో మైలురాయిగా మిగిలిపోతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు రాష్ట్రంలో 70 శాతం భూభాగానికి సాగు, తాగు నీటితో పాటు పరిశ్రమలకు సైతం నీరందించేలా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దేశ నీటిపారుదల రంగంలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే నెల నుంచే నీటి పంపింగ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మానవ నిర్మిత అద్భుతంగా మానవ నిర్మిత అద్భుతంగా నిలుస్తుందని సి.డబ్ల్యు. సి. అధికారుల నుంచి మొదలుకుని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, నీటి పారుదల నిపుణులు కితాబిచ్చిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే శరవేగంగా నిర్మితమైన భారీ ఎత్తిపోతల పథకం. మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో గోదావరి నీళ్లను ఆరు దశల్లో లిఫ్టు చేసి 618 మీటర్ల ఎత్తులో ఉండే కొండపోచమ్మ సాగర్ వరకు తరలిస్తారు. అంటే గోదావరి నది నీళ్లను అరకిలోమీటరుకు పైగా ఎత్తుకు లిఫ్టు చేస్తారు. ఈ ఏడాది ప్రతీ రోజు రెండు టి.ఎం.సి.లను ఎత్తిపోయడానికి అనువుగా పంపుహౌజులు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రతీ రోజు మూడు టిఎంసిల చొప్పున ఎత్తిపోయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున నీటిని లిప్టు చేయడానికి దేశంలో గతంలో ఎన్నడూ వాడనంత పెద్ద సైజు పంపులను వాడుతున్నారు. గోదావరి నదినే సరిహద్దుగా ఉన్న పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోవడమే మొత్తం కాళేశ్వరం ప్రస్తానంలో కీలక అంకం. – 2016 మార్చి 8న దశాబ్దాల తరబడి కొనసాగిన వివాదాలకు స్వస్తి పలుకుతూ, మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. దీని ఫలితంగా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమయింది. 2016 మే 2న కన్నెపల్లి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. జూన్ 21న అధికారికంగా ప్రారంభోత్సవం జరుగనుంది. మూడేళ్ళ స్వల్ప వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన భాగమైన బ్యారేజిలు, పంపుహౌజుల నిర్మాణం పూర్తయింది. రిజర్వాయర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది.
20 లక్షల ఎకరాల ఆయకట్టు… మరో 20 లక్షలు స్థిరీకరణ
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి నియోజకవర్గాల్లోని దాదాపు 20 లక్షల ఎకరాలకు నీరందుతుంది.కాళేశ్వరం నీటి ద్వారానే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం చేపట్టారు. నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టులకు కూడా నీరందివ్వనున్నారు. దీంతో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో మరో 20 లక్షల ఎకరాలు స్థిరీకరించబడతాయి. అంటే మొత్తంగా తెలంగాణలోని 40 లక్షల ఎకరాలకు ప్రతీ ఏడాది రెండు పంటలకు నీరందుతుంది. ఏటా 80 లక్షల ఎకరాల్లో పంటలు పండుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది రోజుకు రెండు టిఎంసిల నీరు ఎత్తిపోయడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్తు అవసరం పడుతుంది. చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ విద్యుత్ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో 139 మెగావాట్ల పంపులు వాడుతున్నారు. భారతదేశంలో ఇంత భారీ సామర్థ్యంతో ఎక్కడా ఎవరూ పంపులు వాడలేదు.

ముఖ్య అతిథిగా ఎపి సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను స్వయంగా ఆహ్వానించనున్న కెసిఆర్

 

 

Kaleshwaram project Inauguration on June 21st