Home తాజా వార్తలు కాళేశ్వరంతో 40 లక్షల ఎకరాలకు నీళ్లు: నిరంజన్ రెడ్డి

కాళేశ్వరంతో 40 లక్షల ఎకరాలకు నీళ్లు: నిరంజన్ రెడ్డి

Niranjan Reddy

 

హైదరాబాద్: రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. వ్యవసాయం రంగంలో నూతన ఆవిష్కరణలు తీసుకొచ్చామని, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమాతో రైతులకు భరోసా కల్పించామని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నామన్నారు. రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందజేస్తున్నామని నిరంజన్ వెల్లడించారు.

 

Kaleshwaram Project Irrigation Water to 40 Lakh Acr