Home తాజా వార్తలు గంగావతరణం

గంగావతరణం

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే చరిత్రాత్మకం. రైతుల తలరాత మార్చే అదృష్టం ఆ ప్రాజెక్టు. నందిమేడారం (ప్యాకేజీ 6) పంపు హౌజ్‌లో మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడం, 124.4 మెగావాట్ల సామర్థం కలిగిన పంపుతో 105 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే ప్రక్రియ అనుకున్నది అనుకున్నట్లుగా విజయవంతంగా జరగడం అత్యంత ఆనందకరం. ఆసియా ఖండంలో తొలిసారిగా 124.4 మెగావాట్ల పంపులను విజయవంతంగా వినియోగిస్తున్న ఏకైక దేశంగా భారతదేశం, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతాయి. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్షంగా మెదడును కరిగించాం. అనేక రకాలుగా ఆలోచించి, ఎంతో శోధించి, చివరికి ప్రాణహిత, గోదావరిల సంగమ స్థానం వద్దే నీటి లభ్యత ఉందని నిర్ధారించుకున్నాం. భగవంతుడి ఆశీస్సులతో అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగాయి. ప్రాజెక్టు పనుల్లో రేయింబవళ్లు కష్టపడుతున్న అధికారులు, ఇంజనీర్లకు హృదయపూర్వకంగా అభినందనలు.

నంది మేడారం వద్ద కాళేశ్వరం వెట్ రన్ గ్రాండ్ సక్సెస్
తొలి పంపు నుంచి ఉబికి ఉరికిన గోదారి గంగమ్మ

మన తెలంగాణ/హైదరాబాద్/ధర్మారం: సజీవ గోదావరి నీటితో పడావు భూములను పచ్చగా చేసే భగీరథ యత్నంలో తొలి అడుగు విజయవంతమైంది. కాళేశ్వర గంగ ఉప్పొంగింది. భగీరథ ప్రయత్నంలో మరో జలదృశ్యం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 6లో ఒక పంపు వెట్న్ విజయవంతమైంది. బుధవారం మధ్యాహ్నం నంది మే డారంలోని భూగర్భ పంపుహౌజ్‌లో ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్, కాళేశ్వరం ఇఎన్‌సి వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు చేసి పంపును ప్రారంభించారు. మొదటి పంపును మధ్యాహ్నం 12.24 గంటలకు వెట్ రన్ చేసాక, సాయంత్రం మరోసారి వెట్ రన్ చేసి పరీక్షించారు. రెండు సార్లు ఎటువంటి సమస్యలు రాలేదని, నీళ్లు విజయవంతంగా ఎత్తిపోశాయని అధికారులు అన్నారు. తొలుత పంపును ఆన్ చేయగానే మోటారు తిరగడం మొదలుపెట్టింది. ఇప్పటికే సర్జ్‌పూల్ నుంచి పంపులకు నీరు వెళ్లేలా డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్లు తెరిచిపెట్టారు. సాంకేతికంగా అవసరమైన ఆర్‌పిఎం రాగానే ఇంపెల్లర్‌కు సంబంధించిన (మొదటిపేజీ తరువాయి)
బటర్ ఫ్లై వాల్వ్‌ను ఇంజనీర్లు తెరిచారు. వాల్వ్‌ను తెరవగానే, నీరు నెమ్మదిగా స్పైరల్ కేసింగ్‌లోకి, తర్వాత డెలివరీ మెయిన్ ద్వారా డెలివరీ సిస్టర్న్‌లోకి చేరింది. డెలివరీ సిస్టర్న్‌లోకి నీళ్లు దుముకగానే అక్కడికి చేరుకున్న అధికారులు, ఇంజనీర్లతో పాటు స్థానిక ప్రజలు కూడా కేరింతలు కొట్టారు. డెలివరీ సిస్టర్న్‌లోకి చేరిన నీరు నేరుగా నంది మేడారం రిజర్వాయర్‌లోకి చేరుతుంది. రిజర్వాయర్ కట్టకు సమీపంలోనే సిస్టర్న్ ఉంది. పంపును మధ్యాహ్నం 30 నిముషాలు మాత్రమే నడిపి, అన్ని సాంకేతిక అంశాలు తనిఖీ చేశారు. సాయం త్రం మరో 20 నిముషాలు పంపును నడిపి, వెట్న్ నిర్వహించారు. రెండు సార్లు విజయవంతం గా, ఎటువంటి అవాంతరాలు లేకుండా పంపు నడిచింది. మేడారంలోని నీరు ఎగిసి, సిస్టర్న్ నుం చి రిజర్వాయర్‌లోకి ప్రవహించింది. ఇంత పెద్ద సామర్థం ఉన్న పంపులు పరీక్షించడం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 40 మెగావాట్ల సామర్థం ఉన్న పంపులు నడుస్తున్నవి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇవే పెద్దవి. కానీ కల్వకుర్తి పంపులకు మూడు రెట్ల సామర్థం ఉన్న పంపులు నంది మేడారం పంపుహౌజ్‌లో ఉన్నాయి. ఆసియా చరిత్రలోనే తొలిసారి అధిక సామర్థం ఉన్న పంపులను వినియోగిస్తున్న రా ష్ట్రంగా తెలంగాణ కీర్తికిరీటంలో కాళేశ్వరం పంపుహౌజ్‌లు చేరతాయి.
వెట్ రన్‌లో పాల్గొన్న ప్రముఖులు
ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, కాళేశ్వరం ఇఎన్‌సి వెంకటేశ్వర్లుతో పాటు ప్రభుత్వ సలహాదారు (లిఫ్టు ఇరిగేషన్) పెంటారెడ్డి, ఇఎన్‌సి (కరీంనగర్ ప్రాజెక్టులు) అనిల్ కు మార్, ఓఎస్‌డి శ్రీధర్‌రావు దేశ్‌పాండే, టిఎస్ ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాష్, ట్రాన్స్‌కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకరరావు, చీఫ్ ఇంజనీర్ (అంతర్రాష్ట్ర వ్యవహారాలు) ఎస్.నరసింహారావు, ఎస్‌ఇ కాళేశ్వరం సుధాకర్‌రెడ్డి, ఇఇ, కాళేశ్వరం నూనె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్యాకేజీ నిర్మాణ ఏజెన్సీ నవయుగ తరపున ఎండి శ్రీధర్, డైరెక్టర్ వెంకట రామారావు, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరపున శ్యాంప్రసాద్ రెడ్డి, రాంరె డ్డి, టి. వెంకటేశం, రమణ నాయక్, సత్తిరెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోదావరి నీటి ని మళ్లించి, వాడుకునే ప్రక్రియలో పాల్గొనడం, ఎన్నో విశేషాల సమాహారమైన కాళేశ్వరం ప్రాజెక్టు పంపు ప్రారంభంలో ఉండడం, జీవిత కాలంలో ఓ మధురఘట్టంగా నిలిచిపోతుందని, అందుకే ఇందులో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతున్నామని పలువురు అభిప్రాయపడ్డారు. మేడారం సిస్టర్న్‌లోంచి ఉప్పొంగిన గోదావరి నీటికి పురోహితులు శాస్త్రోక్తంగా గంగ పూజ చేసారు.
సిఎం ఇచ్చిన ధైర్యంతోనే..
మేడారంలోని పంపు వెట్ రన్ విజయవంతం కావడం పట్ల చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఇక్కడి విషయాలు తెలుసుకుంటూ మాకిచ్చిన సహకారం, నైతికస్థైర్యంతో విజయవంతంగా మొదటి పంపు వెట్ రన్‌ను నిర్వహించామన్నారు. ఏడు పంపుల్లో నాలుగు వెట్ రన్‌కు సిద్ధంగా ఉండగా, మొదటి పంపును వెట్న్ జరిపామన్నారు. మిగతా మూడు పంపులు కూడా దశల వారీగా వెట్ రన్ నిర్వహిస్తామన్నారు.
ఇది చిన్న బాహుబలి..
మేడారంలోని మొదటి పంపు వెట్న్‌న్రు దగ్గరుండి పర్యవేక్షించిన పెంటారెడ్డి ప్యాకేజీ 6 పంపులను చిన్న బాహుబలిగా వర్ణించారు. 124.4 మెగావాట్ల సామర్థం ఉన్న పంపులు మేడారం (ప్యాకేజీ 6)లో ఉండగా, 139 మెగావాట్ల సామర్థం పంపులు (ప్యాకేజీ 8)లో ఉన్నాయని, ప్యాకేజీ 10లో కూడా 134 మెగావాట్ల సామర్థంతో పంపులు ఏర్పాటు చేశామని వివరించారు. లక్ష్మీపూర్ పంపుహౌజ్‌లోని 139 మెగావాట్ల పంపులను పెద్ద బాహుబలి అని చమత్కరించారు. ఎఎంఆర్‌పి ఎత్తిపోతల పథకంలో 18 మెగావాట్ల పంపులను బిహెచ్‌ఇఎల్ డిజైన్ చేసిందని, ఇప్పుడు దాదాపుగా అదే డిజైన్‌తో 124.4 సామర్థంతో మేడారం పంపులు రూపొందించారని స్పష్టం చేశారు. ప్రభుత్వ సహకారం, ముఖ్యమంత్రి ఇచ్చిన నైతిక స్థైర్యంతోనే తక్కువ కాలంలో కాళేశ్వరం పంపులు వెట్ రన్ దశకు చేరుకున్నాయన్నారు.

 

స్పీకర్ పోచారం హర్షం

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో నంది మేడారం పంపుల వెట్న్ విజయవంతం కావడం పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. రికార్డు సమ యంలో వెట్ రన్ ట్రయల్న్‌న్రు విజ యవంతంగా పూర్తిచేసిన అధికారులు, సిబ్బందిని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అభినందించారు. తెలంగాణ వ్యవసాయ రంగం కాళేశ్వరం ప్రాజెక్టుతో సమూలంగా మారబోతుం దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుకు ముందు, తర్వాత అని మాట్లాడుకునేలా ఓ మైలురాయిగా మారుతుందన్నారు. వెట్న్ విజయ వంతం అయిన సందర్భంలో ఇంజనీర్లు, అధికారులను మంత్రి అభినందించారు. వెట్ రన్ విజయవంతం కావడంపై అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంతోషం వ్యక్తపరిచారు.

సిఎం, అధికారులకు శుభాకాంక్షలు: హరీశ్

ప్యాకేజీ 6 నందిమేడారం భూగర్భ పంపుహౌజ్‌లోని మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడం పట్ల మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్‌రావు హర్షం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా రేయింబవళ్లు కష్టపడ్డ ఇంజనీర్లను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

Kaleshwaram Project Started in Telangana