Home తాజా వార్తలు జలేశ్వరం పరవళ్లు

జలేశ్వరం పరవళ్లు

నంది మేడారం వద్ద కాళేశ్వరం రెండవ పంపు వెట్న్ కూడా విజయవంతం

సిచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన స్మితాసబర్వాల్, శ్రీదేవసేన

Kaleshwaram

 

మన తెలంగాణ/పెద్దపల్లి/ధర్మారం:  కాళేశ్వరం ఆరోప్యాకేజీ రెండో పంపు నుండి కూడా గోదావరి జలాల విడుదల గురువారం నాడు విజయవంతంగా జరిగింది. సిఎంవో ముఖ్య కార్యదర్శి స్మితాసబర్వాల్, జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, జాయింట్ కలెక్టర్ వనజాదేవి, నీటిపారుదలశాఖ ఇంజనీరింగ్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు, సిఎంఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, నీటిపారుదలశాఖ సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, నీటిపారుదలశాఖ ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ నూనె శ్రీధర్, నవయుగ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావులు పూజలు నిర్వహించిన అనంతరం రెండో మోటార్ ప్రారంభ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్మితాసబర్వాల్ దగ్గరుండి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అల్లంరాజు శ్రీదేవసేన చేతుల మీదుగా కంప్యూటర్ ద్వారా స్విచ్ ఆన్ చే శారు. ఒక్కసారిగా సంబరాలు అంబరాన్నంటాయి.

నీటిపారుదలశాఖ ఇంజనీర్‌లు, నవయుగ, బీహెచ్‌ఈఎల్, ట్రాన్స్‌కో సిబ్బందితోపాటు రాష్ట్రంలోని వివి ధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రముఖులు చప్పట్లతో హర్షధ్వానాలు మిన్నంటాయి. పూలవర్షం కురుస్తుండగా రెండవ మోటారు వేగం పుంజుకొని ఒక్కసారిగా మేడారం రిజర్వాయర్ వద్ద డెలివరీ సిస్టమ్ నుండి గోదారమ్మతల్లి ఉప్పొంగి ఉబికి వచ్చి ంది. వెంటనే అక్కడికి చేరుకున్న స్మితాసబర్వాల్, శ్రీదేవసేన, వనజాదేవి, నల్ల వెంకటేశ్వర్లు, పెంటారెడ్డి, శ్రీధర్‌రావుదేశ్‌పాండే, నూనె శ్రీధర్‌లు గోదారమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చా రు. ధర్మారం మండలంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు, ప్రముఖులు బహుబలి2 మోటా రు విడుదలకు హాజరయ్యారు. ఇప్పటికే సర్జిపూల్‌లో 142మీటర్ల నీరు నిల్వ ఉండగా, బుధ, గురువారాల్లో వరుసగా  రెండు బాహుబలి మోటార్లు పని చేస్తుండడంతో నీటి విడుదల వేగం పెరిగింది. అనుకున్న వ్యవధికన్నా ముందుగానే అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తాము ఏర్పాటు చేసిన మోటార్లు అందుబాటులోకి రావడంతో నీటిపారుదలశాఖ ఉద్యోగులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్మితాసబర్వాల్, అల్లంరాజు శ్రీదేవసేన స్వీట్లు పంచుకొని విక్టరీ సంకేతాన్ని అందించారు.

జై కెసిఆర్.. జై తెలంగాణ.. నినాదాలతో పంప్‌హౌస్ ప్రాంతమంతా మారుమ్రోగింది. ఈ సందర్భంగా నీటిపారుదలశాఖ ఇంజనీర్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇప్పటికే నాలుగు మోటార్లు అందుబాటులో ఉన్నాయని, జూన్ నాటికి మిగతా మూడు మోటార్లను అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో చుక్కనీరు వృథా పోకుండా గోదావరి జలాలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటామని వెంకటేశ్వర్లు చెప్పారు. తమకు ప్రోత్సాహం అందించి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు సహకారం అందిస్తున్న సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదలశాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ నూనె శ్రీధర్, ఏఈలు ఉపేందర్, రాకేష్, శ్రీనివాస్, పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, సీఐ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.