Wednesday, March 22, 2023

కాళేశ్వరం సూపర్

- Advertisement -

mam

*కెసిఆర్ తాతను కలుస్తా
*నీటి పారుదల బ్రాండ్ అంబాసిడర్ నేహాల్

మనతెలంగాణ/ధర్మారం: కాళేశ్వరంప్రాజెక్టు నిర్మాణం సూ పర్‌గా ఉందని,తన అనుభవాల్ని సిఎం కెసిఆర్ తాతను కలిసి వివరిస్తానని నీటి పారుదల శాఖ బ్రా ండ్ అంబాసిడర్ చిన్నారి నేహాల్ అ న్నారు.శనివారం రాత్రి ఎల్లంపల్లి ప్రా జెక్టు, మేడారంను సందర్శించి పరిశీలించారు. ఎల్లంపల్లి నీటి సామర్థం, గేట్ల బి గింపు, 6ప్యాకెజిలో టన్నెల్ నిర్మాణం, పం ప్‌హౌజ్‌లు, సర్జిపుల్, విద్యుత్ స్టేషన్ల నిర్మాణ పనుల్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇఇ నూనె శ్రీధర్ ప్రతి విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా నేహాల్ విలేకర్లతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప నులు శరవేగంగా జరుగుతున్నాయని సి ఎం కెసిఆర్ తాతను,నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ సార్‌ను తెలంగా ణ ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకుంటారన్నారు.  తాను చూసిన అనుభవాల్ని సిఎం కెసిఆర్ తాతను కలిసి వివరిస్తానని కే ంద్ర ప్రభుత్వానికి సైతం వివరిస్తానని నేహాల్ తెలిపా రు. ప్రచార కర్త గా తనను నియమించిన హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపిన నే హాల్ అన్ని ప్రాంతాల్లో పర్యటించి కాళేశ్వరం ఆవశ్యకతను వివరిస్తానని నేహాల్ తెలిపారు.  తన మేధాశక్తికి తోడుగా నాలుగు గంటల పాటు కాళేశ్వ రం ప్రాజెక్టు వివరాల్ని కూలంకుషంగా వివరించిన ఇఇ నూ నె శ్రీధర్‌కు నేహాల్ కృతజ్ఞతలు తెలిపారు.విలేకర్ల సమావేశంలో నేహాల్ తల్లిదండ్రులు రజని-హన్మంతరావు, ఇఇ నూ నె శ్రీధర్, ఎఇలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News