Saturday, April 20, 2024

సూర్యాపేట జిల్లాను తాకిన కాళేశ్వరం జలాలు

- Advertisement -
- Advertisement -

రైతుల్లో ఆనందం
సాగుకు సిద్ధమవుతున్న రైతులు
ఆరుతడి పంటలకు ఆసరా

Kaleshwaram water enter into Suryapet dist

మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి : కాళేశ్వరం జ లాలు జిల్లాను తాకాయి.. వానాకాలం పంట ప్రారంభ దశ నుంచి చివరి కోత వరకు జలాలు వచ్చాయి. దీంతో యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో కాళేశ్వరం జలాలు వదలడంతో జిల్లాకు చేరుకున్నాయి. నీటిని చూ సిన రైతన్నలు మురసిపోతూ సాగుకు సన్నద్ధమవుతున్నారు. జలాలను చూసిన రైతులు తమ పంట పొలాల కు నీళ్లను పట్టిస్తూ దున్నుతున్నారు. గతంలో సంవత్సరంలో వారం పది రోజుల పాటు నీళ్లు వచ్చేవి. ముఖ్యమంత్రి కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడంతో ప్రతి సంవత్సరం రెండు పంటలకు నీటిని కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకుంటూ పంటలు సాగు చేస్తున్నారు.
మురిసిపోతున్న రైతు..
నీరు కాలువల ద్వారా వస్తుండడంతో రైతు సంతోషం వ్యక్తం చేస్తూ నీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రభుత్వం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సా గు చేయాలని సూచిండంతో రైతులు ఇతర పంటల సా గుకు ప్రాధాన్యం ఇస్తూ సాగు చేస్తున్నారు. అదునులో పంటకు నీళ్లు అందిస్తుండడంతో రైతు మురిసిపోతున్నా డు. నీటిని పంటలకు మళ్లిస్తూ పెసర, కంది, మిరప, వేరుశనగ, మినుములు, బొబ్బర్లు సాగు చేసిన పంటలకు నీటిని మళ్లించి నీళ్లు పారిస్తున్నారు. సకాలంలో నీ ళ్లు అందడంతో రైతు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రైతన్నలు కృతజ్ఞతలు తెలుపుతున్నా రు. వేరుశనగ, మిరప, ఇతర పంటలకు నీరు ఆసరాగా నిలిచిందని, పెరస, కంది చేనుకు ప్రత్యేకంగా ఉపయోగించుకుంటున్నామనిరైతులుహర్షంవ్యక్తం చేస్తున్నారు.
మరో పక్క రైతుబంధు..
ఒక పక్క కాళేశ్వరం జలాలు కాలువల ద్వారా జిల్లాకు చేరాయి. దాంతో పాటు రైతు పంట పెట్టుబడి కింద రై తుబంధు ఖాతాల్లో జమ చేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పెట్టుబడి సమయంలో రైతుబంధు ఇచ్చి.. పంటను సాగు చేసుకోవడానికి నీరు సకాలంలో అందించడంతో ముందస్తు ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై ప్రత్యేక దృష్టి..
నీటిని సద్వినియోగం చేసుకొని వరి కాకుండా పప్పుధాన్యాలు తదితర పంటలపై దృష్టి పెట్టి వచ్చే నీటిని వినియోగించుకుంటూ పంటలు సాగు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఈ సీజన్‌లో వేరుశనగ, మినుములు, పెసర్లు, కందులు సాగు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు అని రైతులకు సూచిస్తున్నారు.
పంట చివరి వరకు నీరు అందిస్తుండడంతో రైతులు అధైర్యపడకుండా అంతర పంటలపై దృష్టి పె డితే దిగుబడితో పాటు ఆర్థికంగా బలపడవచ్చని సూచిస్తున్నారు. ఒక పక్క జలకళ.. మరోపక్క ఎవుసం పండుగలా సాగుతోంది. సకాలంలో నీరందించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News