Saturday, April 20, 2024

వచ్చే శివరాత్రికి కాళేశ్వరం నీళ్లు మెదక్‌కు: హరీష్

- Advertisement -
- Advertisement -

మెదక్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని ఆలయాలకు అన్యాయం జరిగిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రభుత్వం తరపున వనదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రి హరీష్ రావు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే శివరాత్రికి కాళేశ్వరం నీళ్లు మెదక్ జిల్లాకు చేరుతాయని, కాళేశ్వరం పనులను సిఎం కెసిఆర్ యుద్ధ ప్రాతిపదికన చేయిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలకు సిఎం కెసిఆర్ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని పొగిడారు. దేవాదాయ శాఖను బలోపేతం చేసి ఉద్యోగులకు, వేతనాలు ఇస్తున్నామని హరీష్ వివరించారు. ఏడు పాయలకు వచ్చే భక్తుల కోసం మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మెదక్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్‌ఎలు, పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డిలు పాల్గొన్నారు.

 

Kaleshwaram water flow in Medak in Shivaratrin 2021
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News