Home నిజామాబాద్ జోరుగా కల్తీ నూనే వ్యాపారం

జోరుగా కల్తీ నూనే వ్యాపారం

 Kalti Oil is the business  In Nizamabad District
నాలుగేళ్ళ క్రితం హస్గుల్, శేకాపూర్‌లల్లో బొక్కల నూనే తయారి
రెండేళ్ళ క్రితం జుక్కల్ పోలిసులకు చిక్కిన పశువుల కొవ్వు పీపాల డబ్బలు, తోలు   
గత నెల నిజామాబాద్ పట్టణంలో పట్టుబడిన వైనం
నిగ్గు తేల్చడంలో అధికారుల అలసత్వం
మన తెలంగాణ/జుక్కల్: జంతువుల కళేబరాలతో అక్రమార్కులు నిత్యం వ్యాపారం చేస్తూనే ఉన్నారు. అయితే వీరికి అడ్డుకట్ట వేసేవారు లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా అనిపిస్తుంది. ఇటివల ఉమ్మడి నిజామాబాద్ పట్టణంలోనే బొక్కల నూనే తయారు చేస్తూ పట్టుబడిన వైనం అందిరికి తెలిసిందే. అయితే అధికారులు మాత్రం అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ఆరోగ్యంలో ఆటలాడుకుంటున్న కొందరు అక్రమార్కులు తక్కువ ధరకు కళేబరాల నుంచి తీసిన కొవ్వు పదార్థాన్ని విక్రయించుకుంటు తమ పబ్బాన్ని గడుపుకుంటున్నారు. అయిన పైపై తనిఖిలు చేపట్టి చేతులు దులుపుకునే అధికారుల తీరు చూస్తే హస్యమేస్తుందని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇదే విధంగా గత రెండేళ్ళ క్రితం కూడ పక్క రాష్ట్రల నుంచి ఎలాంటి జంతువులు రాకుండా ఉండేందుకు చెక్‌పోస్టును ఏర్పాటు చేసిన ఫలితం లేకుండా పోయింది. అప్పట్లో అదే రోజు జుక్కల్ మండల కేంద్రం నుంచి మహారాష్ట్ర దెగ్లూర్‌కు ఆయ జంతువుల కళేబరాల నుంచి తీసిన కొవ్వును నాలుగు పీపాల్లో తీసుకెళ్తుండగా బజరంగ్‌దళ్ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు వారు పోలీస్టేషన్ ముందు నుంచి వెళుతున్న మహరాష్ట్ర బొక్కల నూనే వ్యాపారులకు పట్టుకున్నారు. అయితే దానికి వలయధికారి, ఎస్‌లు వచ్చేంత వరకు ఉంచారు.

అధికారులు వచ్చిన తరువాత ఇవి కేవలం కొవ్వు పదార్థాలని, ఒక తోలు మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. కాని ఇది జందువుల బొక్కల నుంచి తీసిన కొవ్వు కాదా…? దీని ద్వార బొక్కల నూనే తయారు చేయలేరా….? జిల్లాలో ఎక్కడ చేయడం లేదా…? అని బజరంగ్‌దళ్ సభ్యులు ప్రశ్నించారు. అయితే దానికి వారి వద్ద నుంచి సమాధానం రాలేదంటే పోలీసుల చిత్తశుద్ది తేటతెల్లయ్యింది. అప్పట్లో ప్రజలు మాత్రం అమ్యయ్యలకు ఆశించే వారిని వదిలివేశారనే ఆరోపణలు గుప్పించారు. అదే విధంగా దానికంటే రెండేళ్ళ ముందు బిచ్కుంద మండలంలోని శేట్లూర్, సిరిసముందర్ గ్రామ శివారులో ఆవు కళేబరాలతో నూనే తయారు చేస్తున్న వైనాన్నీ గ్రామస్తులు కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందిచారు. అనంతరం రేవెన్యు అధికారులకు సమాచారాన్నీ తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు చూడగ అక్కడ సుమారు 39 ఆవు బొక్కల నుంచి తీసిన నూనే పీపాలు కనిపించాయి. ఎన్నో ఆవు, బర్రెలు, దూడల తలలు, కొమ్ములు వారు ఏర్పరచిన కొమ్ములు కనిపించాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకుని ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించగ అక్కడ ఉన్న కళేబరాలను వారు సంబంధిత అధికారులకు తెలియజేశారు. దీంతో ఉమ్మడి బోధన్ ఆర్‌డిఓ శ్యాంప్రసాద్ లాల్ వచ్చి వివరాలు కనుక్కోన్నారు. ఉన్న కళేబరాలను ఒక వ్యాన్‌లో ఎక్కించి పోలీస్టేషన్‌కు తరలించారు. ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. ఈ వ్యాపారం మహారాష్ట్రలోని దెగ్లూర్ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి తీసుకు వచ్చి మంజీర తీరం పక్కన నిర్వహిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ ఆవు నూనేను హైద్రాబాద్ ప్రాంతానికి తరలిస్తున్నట్లు తెలిసింది.
అసలు అడ్డా ఎక్కడుందో ఎవరికి తెలియకపోయిన మోబైల్ అడ్డాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్, జుక్కల్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో ఉన్నట్లు కొన్ని సంఘటనల ఆధారాల పరంగా చూస్తే అర్ధమౌతోంది. కొన్ని చోట్ల కేసులు నమోదు చేసి నిందుతులను వదిలేస్తున్న పోలిసులు, రేవెన్యు అధికారులు బొక్కల మాఫియాకు గులాంగిరి చేస్తున్నట్లు స్పష్ఠంగా తెలుస్తోంది. ఎందుకంటే వారి దృష్ఠికి సంఘటనలు వెళ్ళినప్పటికి వారు తూతూ మంత్రంగా కేసులు నమోదు చేయడం వారిని వదిలేయడం, లేకుంటే అసలే కేసులు కూడ నమోదు చేయకుండా నామమాత్రపు జరిమానాలు విధించి వదిలేయడం, అక్కడక్కడ అది కూడ చేయకుండానే మాఫియా పేరు చెబితేనే లాగులు తడుపుకునే అధికారుల తీరు చూస్తే సభ్యసమాజానికి తలదించుకునే విధంగ వ్యవహరించడం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమౌతోంది. చేతకాని అధికారులు ఉండి ఎందుకు అని ప్రజలు బాహటంగానే విమర్శిస్తున్నారు. ఎంతో గుట్టుగా నడిపిస్తున్న ఈ దందాను సంబంధిత అధికారులకు తెలియజేస్తే వారు వారి జేబులు నింపుకోడానికే మొదటి ప్రాధాన్యతనిస్తున్నట్లు కనిపిస్తుందని భజరంగ్‌దళ్ సభ్యులు బహిరంంగానే ఆరోపిస్తున్నారు. అధికార యంత్రాంగం ఎంత మాత్రం పట్టించుకోకపోవడం వెనుక మతలబేంటని వారు ప్రశ్నిస్తున్నారు. చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల వారు తీవ్రంగ ఈ వ్యవహారాన్ని ఖండిస్తున్నారు. ఎన్నో చోట్ల ఈ దందా కొనసాగుతున్నప్పటకి జిల్లా యంత్రాంగమే ఈ మాఫియాకు భయపడుతోందని అందుకే వారిపై చర్యలు తీసుకోవడం లేదని వారు దుయ్యబడుతున్నారు.