*ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్
మనతెలంగాణ/ధర్మారం: కల్యాణ లక్ష్మి ఆడపిల్ల పాలిటా వరమని, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మారం మండల కేంద్రంలో బుధవారం నాడు 31మంది లబ్ధిదారులకు 21.35లక్షల కళ్యాణలక్ష్మి చెక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ, కెసిఆర్ అంకుఠిత దీక్ష, ప్రాణ సమానమైన కల్యాణ లక్ష్మి పథకం నిరుపేదల ఇళ్లల్లో వెలుగులు నింపిందని అన్నారు. ఆడపిల్ల పెళ్లి చేసే తల్లిదండ్రులకు కొండంతా అండగా నిలుస్తున్న కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకం పట్ల కేంద్రం అభినందించడం హర్షణీయమని అన్నారు. ఈ పథకం పరిధి పెంచి, అని్ంన వర్గాలకు విస్తరించేందుకు ప్రభుత్వ కృషి చేస్తుందని ఈశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చై ర్మన్ ఠాకూర్ రఘవీర్ సింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్త నర్సింహు లు, వైస్ చైర్మన్ కోమటిరెడ్డి మల్లారెడ్డి, ఎంపిపి పాక మల్లేశ్వరి వెంకటే శం తహసీల్దార్ కె.వై. ప్రసాద్, ఉప తహసీల్దార్ కె. శ్రీనివాస్ రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు కాడే సూర్యనారాయణ; ఎంపిటిసి బొల్లి స్వామి, వైస్ ఎంపిపి నార ప్రభాకర్ పాల్గొన్నారు.
ఆడపిల్లలకు వరం కల్యాణ లక్ష్మి
- Advertisement -
- Advertisement -