Home తాజా వార్తలు ‘పుష్పక విమానం’ నుంచి పాట విడుదల

‘పుష్పక విమానం’ నుంచి పాట విడుదల

Kalynam Song Release From Pushpaka Vimanamహైదరాబాద్ : ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘పుష్పక విమానం’. ఈ సినిమా నుంచి ‘కళ్యాణం’ అనే పాటను ప్రముఖ నటి సమంత అక్కినేని శుక్రవారం విడుదల చేశారు. విజయ్ దేవరకొండ సమర్పణలో ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ప్రొడక్షన్ – టాంగా ప్రొడక్షన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాను నూతన దర్శకుడు దామోదర రూపొందించారు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండకు జోడీగా గీత్ సైని , శాన్వి మేఘన నటించారు. ఇటీవల ఈ సినిమా నుంచి ‘సిలకా’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు రామ్ మిరియాల – సిద్దార్థ్ సదాశివుని – అమిత్ దాసాని సంగీతం అందించారు. ఆనంద్ దేవరకొండ ’దొరసాని‘, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆనంద్ మూడో సినిమాగా వస్తున్న ‘పుష్పక విమానం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.