Friday, April 19, 2024

కమల్ హాసన్ ఓ సూపర్-నోటా

- Advertisement -
- Advertisement -

Kamal Haasan is a super-nota

ఆయన పార్టీకి ఒక్క సీటూ రాదు
కాంగ్రెస్ ఎంపి కార్తీ చిదంబరం వ్యాఖ్య

న్యూఢిల్లీ: తమిళ నటుడు, మక్కళ్ నీతి మయ్యమ్(ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్‌ను ”సూపర్-నోటా”(ఇవిఎంలో నన్ ఆఫ్ ది ఎబవ్ ఆప్షన్)గా కాంగ్రెస్ ఎంపి కార్తీ చిదంబరం అభివర్ణించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదని, ఆ పార్టీకి రాజకీయ మనుగడ ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో కార్తీ చిదంబరం తమిళనాడులో ఎఐఎడిఎంకె-బిజెపి ఎన్నికల పొత్తును వ్యతిరేకించారు. ”హిందీ-హిందుత్వ” సిద్ధాంతాలతో కూడిన బిజెపి ”మరక, వాసన లేదా నీడ” పడే ప్రభుత్వం తమకు వద్దని తమిళనాడు ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలలో 200కు పైగా స్థానాలను డిఎంకె-కాంగ్రెస్ కూటమి గెలుచుకోనున్నదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తమిళుల మనోభావాలను, తమిళ భాషను, తమిళ సంస్కృతిని గౌరవించని ప్రభుత్వం తమకు వద్దని తమిళనాడు ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పారు. బిజెపికి చెందిన హిందీ-హిందుత్వ అజెండా తమిళ ప్రజలు సహించబోరని, బిజెపిని ఏ రూపంలో కూడా వారు రాష్ట్రంలో అనుమతించబోరని కార్తీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల జరిపిన తమిళనాడు ఎన్నికల ప్రచారం కాని, బిజెపి నాయకులు విస్తృతంగా చేస్తున్న ప్రచార యాత్రలు కాని బిజెపి విజయావకాశాలకు ఏమాత్రం తోడ్పడబోవని, ఆ పార్టీ ప్రస్తుత తరహాలోనే ఒక్క ఎమ్మెల్యే కాని ఒక్క ఎంపీ లేని రాష్ట్రంగా మిగిలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. డిఎంకెతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News