Home జాతీయ వార్తలు ఇసితో కమల్ భేటీ

ఇసితో కమల్ భేటీ

kamal

న్యూఢిల్లీ: మక్కల్ నీది మయమ్ వ్యవస్థాపకుడు కమల హాసన్ భారత ఎన్నికల సంఘం అధి కారులను కలిశారు. తాను స్థాపించిన పార్టీ రిజిస్ట్రేషన్ కో సం ఆయన అధికారులను సం ప్రదించారు. రాజకీయ వేత్తగా మారిన ప్రముఖ హీరో అధికా రులను కలిసిన తరువాత మీడి యాకు వివరాలు తెలిపారు. తాను ఫిబ్రవరిలో ప్రారంభించిన పార్టీ త్వరలోనే రిజిస్టర్ అవుతుం దని చెప్పారు. ఎన్నికల సంఘం అధికారులను కలవడానికి వచ్చానని, వారు కొన్ని ప్రశ్నలు వేశారని చెప్పారు. తన సమాధానాలపై వారికి ప్రధానమైన అభ్యంతరాలులేవని ఆయన తెలిపారు. పార్టీ రిజి స్ట్రేషన్ త్వరలోనే పూర్తవుతుందని అధికారులు తమకు హామీ ఇచ్చారని 63 యేళ్ల హీరో చెప్పారు. అయితే ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుంతుందనేది అధికారులు చెప్పలేదని ఆయన అన్నారు. పార్టీ సింబల్‌పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, పార్టీలో చర్చించిన తరువాత ఓ నిర్ణయం తీసుకుని ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ఆయన తెలిపారు. మక్కల్ నీది మయమ్ అంటే ప్రజా న్యాయం పార్టీ అని కమల్ హాసన్ తెలిపారు.
రాహుల్‌ను కలుసుకున్న కమల్‌హాసన్
ప్రముఖ నటుడు, ’మక్కల్ నీది మయం’ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ బుధవారంనాడిక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్టు చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారంలో తామిద్దరూ కలుసుకున్నామని, మరోసారి కలవాలని అప్పుడు అనుకున్నందున రాహుల్‌ను కలిసానని చెప్పారు. తమిళనాడు రాజకీయ పరిస్థితులతో పాటు ఇరుపార్టీలకు సంబంధించిన అంశాలపై తాము మాట్లాడుకున్నట్టు చెప్పారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ఇక్కడకు వచ్చినట్టు ఆయన చెప్పారు.