Wednesday, April 24, 2024

రాజస్థాన్ సంక్షోభంలో కమల్ నాథ్ మధ్యవర్తిత్వం వహించొచ్చు

- Advertisement -
- Advertisement -

Kamalnath

న్యూఢిల్లీ: రాజస్థాన్ సంక్షోభంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్యవర్తిత్వం నెరపొచ్చని అభిజ్ఞవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అశోక్ గెహ్లోత్ తమ ముఖ్యమంత్రిగానే ఉండాలని లేకుంటే తాము రాజీనామా చేస్తామని 92 మంది ఎంఎల్‌ఏలు హెచ్చరించారు. అయితే రాహుల్ గాంధీ ‘అలా కుదరదని, ఒకరు ఒక పదవికే అన్న నియమం కొనసాగుతుందని’ అన్నారు. అశోక్ గెహ్లోత్‌కు ప్రత్యర్థి అయిన సచిన్ పైలట్‌ను, ఆయన 21 మంది నమ్మినబంట్లను దూరంగా ఉంచాలని ఆ ఎంఎల్‌ఏలు భావిస్తున్నారు.

నిన్న లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి ముందు గెహ్లోత్ టీమ్ ఎంఎల్‌ఏ శాంతి ధారివాల్ ఇంట్లో సమావేశమయ్యారు. 102మంది శాసనసభ్యుల నుంచే ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలని తీర్మానం చేశారు. 2020లో సచిన్ పైలట్ తన తిరుగుబాటు అనుచరులతో రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చేంత స్థాయికి తీసుకెళ్లినప్పుడు ఈ 102 మంది ఎంఎల్‌ఏలే అశోక్ గెహ్లోత్‌కు అండగా ఉండి ప్రభుత్వాన్ని నిలబెట్టారు. కాగా రాజస్థాన్‌లో సంక్షోభాన్ని తొలగించేందుకు కేంద్ర పరిశీలకులు మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్‌లను రాజస్థాన్‌కు పంపడం జరిగింది. వారు ఎంఎల్‌ఏలతో వ్యక్తిగతంగా మాట్లాడి సంక్షోభాన్ని నివారించే ప్రయత్నం చేసారు. వారు నేడు ఢిల్లీకి తిరిగొచ్చారు. కాగా తిరుగుబాటు ఎంఎల్‌ఏలు కేంద్ర నాయకులతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. చాలా మంది ఎంఎల్‌ఏలు నవరాత్రులు జరుపుకోడానికి తమ ఊర్లకు వెళ్లిపోయారని తెలిసింది. పార్టీ అంతర్గత ఎన్నిక తర్వాతే ముఖ్యమంత్రి అంశాన్ని పరిష్కరించాలని ఎంఎల్‌ఏలు అంటున్నారు. కాగా సోనియా గాంధీ కుటుంబం అశోక్ గెహ్లోత్ కారణంగా తలెత్తిన పరిస్థితిపై అప్‌సెట్‌గా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సిందియా కారణంగా కమల్‌నాథ్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. పంజాబ్‌లో నవజోత్ సిధుతో సరిపడక అమరీందర్ సింగ్ కూడా ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తు చేసేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News