Thursday, April 25, 2024

అమెరికాలో భారతీయం

- Advertisement -
- Advertisement -

అమెరికా ఉపాధ్యక్ష బరిలో కమలాహారిస్
భారతీయ సంతతి మహిళకు గౌరవం
డెమోక్రాటిక్ పార్టీ తరఫున అభ్యర్థి
కాలిఫోర్నియా సెనెటర్‌గా అనుభవం

Kamala Harris selected as US Vice President Candidate

వాషింగ్టన్: అమెరికాలో ఉపాధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా భారతీయ సంతతి మహిళ కమలా హారిస్ ఎంపిక అయ్యారు. దేశ అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3వ తేదీన జరుగనున్నాయి. అధ్యక్ష పదవికి ప్రతిపక్ష డెమొక్రట్ అభ్యర్థిగా జో బిడెన్ బరిలో ఉన్నారు. ట్రంప్ అధ్యక్ష స్థానానికి సవాలు విసురుతున్నారు. భారతీయ సంతతి మహిళకు పూర్తిస్థాయి గౌరవం దక్కేలా జో బిడెన్ ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్‌ను ఎంపికచేశారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపికైన తొలి నల్లజాతి వ్యక్తిగా ఈ కాలిఫోర్నియా డెమోక్రాట్ సెనెటర్ కమలా ఇప్పుడు స్థానం సంపాదించుకున్నారు. దేశ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలలో నల్లజాతీయులకు, భారతీయ మహిళకు ప్రాతినిధ్యం దక్కడం ఓ చరిత్ర అయింది. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీకి కమలా పార్టీ ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా కూడా ఉన్నారు.

దేశంలో అత్యంత ప్రధాన కేంద్రం అయిన కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కమలా హారిస్ చాలా కాలంగా ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరు సల్పుతున్నారు. పార్టీలో తమ సహ అభ్యర్థిగా కమలా హారిస్‌ను ఎంపిక చేసినట్లు జో బిడెన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తామిద్దరం కలిసి ట్రంప్‌ను ఓడించబోతున్నట్లు బిడెన్ ప్రకటించారు. అమెరికా ఇప్పుడు పట్టాలు తప్పిన పరిస్థితిలో ఉందని, దీనిని తిరిగి అన్ని విధాలుగా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో తనకు హారిస్ సరైన కార్యాచరణ భాగస్వామిగా నిలుస్తుందని విశ్వసించే ఆమెను ఉపాధ్యక్ష స్థానానికి ఎంపిక చేసినట్లు బిడెన్ తెలిపారు. దేశ ఉపాధ్యక్ష పదవికి పోటీదారుగా ఎంపిక కావడం పట్ల కమలా హారిస్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు గర్వకారణం, అమెరికాలో దక్కిన గౌరవం అని స్పందించారు. కమలా తల్లి భారతీయురాలు. తండ్రి ఆఫ్రికాలోని జమైకా వాసి. తల్లి తమిళనాడుకు చెందిన శ్యామలా గోపాలన్ చెన్నై వాసి. క్యాన్సర్ పరిశోధకురాలైన డాక్టర్ శ్యామలా 1960లో అమెరికాకు వెళ్లి అక్కడనే స్థిరపడ్డారు. కమలా హారిస్‌పై తల్లి ప్రభావం ఎక్కువగా ఉంది. 2003లో కమల తల్లిని కోల్పోయారు. తండ్రి డొనాల్డ్ హారిస్ జమైకన్, కమల చిన్నగా ఉన్నప్పుడే తల్లి దండ్రులు విడిపొయ్యారు.

ఇదో వండర్: ట్రంప్
ప్రతిపక్ష పార్టీ డెమొక్రట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ ఎంపికపై అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయం తనకు ఆశ్యర్యాన్ని కల్గించిందన్నారు. ఆమె ఓ భయంకరమైన వ్యక్తి అని వైట్‌హౌజ్‌లో విలేకరులతో మాట్లాడుతూ విమర్శలకు దిగారు. ఎందుకు భయంకరమైన వ్యక్తి అనేది తెలియచేయలేదు. ప్రైమరీల దశలో పోటీ సమయంలోనే ఆమె మరీ చీప్‌గా వ్యవహరించారని, ఆమె తనను ఆకట్టుకోలేకపోయ్యారని ట్రంప్ వ్యాఖ్యానించారు. యుఎస్ సెనేట్‌లో ఆమె అంత అగౌరవనీయ వ్యక్తి ఎవరూ లేరని, ఇది ఆమె ఖ్యాతి అని ట్రంప్ చెప్పారు.

Kamala Harris selected as US Vice President Candidate

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News