Home కామారెడ్డి దశాబ్దాల డిమాండ్ రైల్వే బ్రిడ్జ్..

దశాబ్దాల డిమాండ్ రైల్వే బ్రిడ్జ్..

Kamareddy People Demond Biuld Ralway Over Birdge

మన తెలంగాణ/ కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెండో రైల్వే ఒవర్ బ్రిడ్జ్ నిర్మించాలని దశాబ్దాలుగా ప్రజలు డిమాండ్ చెస్తున్నారు. రైల్వే శాఖ స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. కామారెడ్డి డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు బాలుర హైస్కూలు ముందు రైల్వే గేటును నిర్మించారు. బ్రి డ్జ్ లేక జిల్లా కేంద్రంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యగా మారింది. అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్ర స్తుతం జిల్లా కేంద్రంగా మారిన కామారెడ్డి పట్టణం 5 జిల్లాలకు కేంద్రంగా ఉన్నది. మేదక్, నిజామబాద్, రాజన్న సిరిసిల్లా, సిద్దిపేట జిల్లాల ప్రజలు ప్రతిరోజు వేల సంఖ్యలో కామారెడ్డి వస్తూ పోతుంటారు. ప్రస్తుత బ్రిడ్జి తీవ్రమైన ఇరుకుగా మారింది. ట్రాఫిక్‌కు సరిపోవడం లేదు. ఇరవై ఏళ్ల క్రితం రైల్వే శాఖపై ప్రజలు, నేతలు ఒత్తిడి చేయడంతో అశోక్ నగర్ కాలనీలో రైల్వే గేటును ఏర్పాటు చేశారు. రెండవ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రజలు 30 ఏళ్లుగా డి మాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జ్ ఇరుకుగా మారి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఐదు మాసాల క్రితం రైలు పట్టాలు దాటుతున్న ముగ్గురిని గూడ్స్ రైలు డీకొనడంతో చనిపోయారు. భిక్కనూరు మండలానికి చెందిన త ల్లికూతురు, మరో విద్యార్థిని పట్టాలు దాటుతుండగా గూ డ్స్ రైలు ఢీకొని స్పాట్‌లో చనిసోయారు. మృతులు బంధువులు రైల్వే బ్రిడ్జి కోసం ప్రజలు డిమాండ్ చెస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రధాన సమస్య ఎన్నికలు వచ్చినప్పుడు హమీగా మిగిలిపోయింది. దాదాపు లక్ష జనాభా కలిగి, మరో 50 వేల ప్రజల రాకపోకలు ఉండే కామారెడ్డిలో రెం డో బ్రిడ్జి నిర్మాణంపై రైల్వే శాఖ అసలు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. నిజాం కాలంలో నిర్మించిన రైల్వే నిర్మాణాలు తప్ప గత పాలకులు శ్రద్ధ్ద తీసుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో బ్రిడ్జిని ర్మా ణం ప్రధాన సమస్యగా మారింది. ప్రజా పోరాటంతో అశోక్‌నగర్‌లో రైల్వే గేటు ఏర్పాటు చేశారు. రెండో బ్రిడ్జి డి మాండ్ కలగానే మిగిలిపోయింది. రైలు, బస్సులలో పట్టణంకు వేలాది ప్రజల రాకపోకలు సాగుతున్నాయి. అశోక్‌నగర్‌లోని రైల్వేగేటు వద్ద 20 నిమిషాలకు ఒకసారి గేటు వేయడంతో ప్రజలు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. జిల్లా కేంద్రం కావడంతో నిత్యం గేటు వద్ద వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. బాయిస్ హైస్కూల్ వద్ద ఇరుకు రైల్వే బ్రిడ్జ్ అశోక్ నగర్ వద్ద గంటల తరబడి ఎదురు చూపులు జిల్లా కేంద్రంలో వాహనదారులకు నరకం కనిపిస్తుందని ఆవేదన చెందుతున్నారు. రైలు పట్టాలపై మరో బ్రిడ్జి ని ర్మాణం ప్రధాన సమస్యగా మారింది. సరుకుల రవాణా తో రాబడి వస్తున్నా, నిత్యం వేలాది మంది రైల్వేలలో ప్ర యాణిస్తున్నా, బ్రిడ్జి లేక ప్రాణాలు పోతున్నా రైల్వే శాఖ తీ వ్ర నిర్లక్షం వహిస్తుందని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణాన్ని రెండుగా విభజిస్తున్న రైలు పట్టాలు బ్రిడ్జి లేక నరకయాతన పడుతున్నారు. వందల ప్రమాదా లు జరిగిన, పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినా సమస్య పరిష్కారం కావడం లేదని  ఆవేదన చెందుతున్నారు.