Friday, March 29, 2024

మరో నయా ‘ఉసేన్ బోల్ట్’ నిషాంత్ శెట్టి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్ణాటకలో జరిగే సంప్రదాయ కంబళ పోటీలో మరో కొత్త ఉసేన్ బోల్ట్ వెలుగులోకి వచ్చాడు. ఇప్పటికే దున్నపోతుల పందెం పోటీలో శ్రీనివాస్ గౌడ చిరుత వేగంతో పరుగెత్తి జమైకా దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ రికార్డును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. కంబళ పోటీలో అసాధారణ వేగంతో పరిగెత్తి శ్రీనివాస్ చరిత్ర సృష్టించాడు. తాజాగా కంబళ పోటీల్లో మరో అథ్లెట్ ఇలాంటి రికార్డే సాధించి వార్తల్లో నిలిచాడు. బజగోళి జోగిబెట్టు ప్రాంతానికి చెందిన నిషాంత్ శెట్టి అనే యువకుడు కంబళ పోటీలో 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకన్లలోనే పూర్తి చేసి పెను ప్రకంపనలు సృష్టించాడు. ఇదే క్రమంలో ఇప్పటి వరకు ఉసేన్ బోల్ట్, శ్రీనివాస్ గౌడల పేరిట ఉన్న రికార్డును నిషాంత్ బద్దలు కొట్టాడు. వీరికంటే 0.03 సెకన్ల ముందుగానే నిషాంత్ రేసును పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు.

Kambala runner Nishit shetty set up new record

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News