Tuesday, April 23, 2024

‘తలైవి’గా మెప్పించిన కంగన

- Advertisement -
- Advertisement -

Kangana impresses at Thalaivi Getup

 

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి – ది రివల్యూషనరీ లీడర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. శనివారం జయలలిత నాలుగవ వర్ధంతి సందర్భంగా ‘తలైవి’ బయోపిక్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను కంగనా సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్ట్ చేశారు. కంగనా షేర్ చేసిన వర్కింగ్ స్టిల్స్‌లో ‘తలైవి’ గెటప్‌లో కంగన ఆకట్టుకుంటోంది. ఒక ఫొటోలో ఆమె ఠీవిగా నడుస్తూ కనిపిస్తుండగా.. మరో దాంట్లో హాస్టల్‌లో భోజనం చేస్తున్న చిన్నారులతో కరచాలనం చేస్తూ దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా కంగనా రనౌత్ దివంగత జయలలితకు ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. మరో వారం రోజుల్లో సినిమా పూర్తికానుందని.. సూపర్ హ్యూమన్‌లా సినిమాను తెరకెక్కిస్తున్న విజయ్‌తోపాటు చిత్ర యూనిట్‌కి ప్రత్యేక ధన్యవాదాలు అని కంగనా ట్వీట్‌లో పేర్కొన్నారు. కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి, – ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News