Thursday, April 25, 2024

అందుకు నేను గర్వపడుతున్నా

- Advertisement -
- Advertisement -

Kangana Ranaut comments on Hrithik Roshan

 

ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడడం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు అలవాటు. అందరూ అది పొగరు అంటే కంగనా మాత్రం తాను నిజాయితీగా మాట్లాడతానని అంటుంది. ఆమె తీరు కొందరికి నచ్చుతుంది కానీ ఆ ముక్కుసూటితనమే కొన్నిసార్లు వివాదాలలోకి నెట్టేస్తుంది. అలాగని తీరు మార్చుకునే రకం కాదు కంగనా. తాజాగా తన మాజీ బాయ్ ఫ్రెండ్ అయిన స్టార్ హీరో హృతిక్ రోషన్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడి మరోసారి వివాదానికి తెరలేపింది. హృతిక్‌పై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ పేరు కూడా ప్రస్తావించింది. తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. “ఒకప్పుడు నేను ‘డబ్బు ,- అత్యాశ’ లాంటి ట్యాగ్ లైన్లను విన్నా. కానీ ఇప్పుడు నాకు ముంబయ్‌లో సొంత ఇల్లు.. విలాసవంతమైన ఆఫీసు ఉన్నందుకు గర్వపడుతున్నా.

అయితే నా మాజీ బాయ్‌ఫ్రెండ్ హృతిక్ రోషన్ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ ఇంటి అద్దెను అతని తండ్రి రాకేష్ రోషన్ చెల్లిస్తున్నాడు”అని చెప్పింది. “కెరీర్ ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ తర్వాత నా జర్నీ సాఫీగా సాగింది. ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. కొంతకాలం కిందట హృతిక్ రోషన్ తో వివాదం జరిగింది. న్యాయపోరాటం చేస్తే డబ్బులు కోసం చేస్తున్నానని చిత్రీకరించే యత్నం చేశారు. కానీ ఈ రోజు నేను సొంత ఇంట్లో ఉంటున్నాను. విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. కానీ హృతిక్ ఇంకా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతడి తండ్రి అద్దె చెల్లిస్తున్నాడు తెలుసా.. నేను డబ్బు కోసం పాకులాడటం లేదని చెప్పేందుకు ఇది చాలనుకుంటా” అంటూ మరోసారి హృతిక్ రోషన్ లక్ష్యంగా కంగనా రనౌత్ కామెంట్లు చేసింది. ప్రస్తుతం కంగనా కామెంట్స్ నెట్టింట వివాదాస్పదంగా మారుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News