- Advertisement -
తన జీవితంలో ప్రేమకిక చోటు లేదని తేల్చేసింది బాలీవుడ్ బ్యూటీ కంగనారనౌత్. ‘ఏక్ నిరంజన్’ సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఈ భామ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడే పలువురితో ఎఫైర్స్ నడిపేసింది. సినిమాల్లోకి వచ్చాక ఆ ఎఫైర్లను కొనసాగించింది. ఇటీవల ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా ఎఫైర్లకు పుల్‌స్టాప్ పెట్టేసి పూర్తిగా నటినపైనే దృష్టిపెట్టి బాలీవుడ్లో వరుస విజయాల్ని అందుకుంది కంగనారనౌత్. ఈ భామ యువతకు ఓ మంచి సందేశాన్ని కూడా ఇచ్చింది. “భౌతిక ఆకర్షణనే చాలామంది ప్రేమని అనుకుంటారు. మొదట్లో నేను కూడా అలాగే అనుకొని మోసపోయాను. ప్రేమించడానికి మానసికంగా మెచ్యూరిటీ ఎంతో అవసరం. అప్పుడే సరైన వ్యక్తిని ప్రేమించగల్గుతాం”అని చెప్పింది కంగనారనౌత్.
- Advertisement -