Tuesday, April 23, 2024

కంటి వెలుగు-2 ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్‌తో పాటు యూపి మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రారంభించారు. బుధవారం ముందుగా సమీకృత నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తరువాత రెండో విత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కంటి వెలుగు లబ్ధిదారులు ధరవాత్ బిచ్చమ్మ, మందా అన్నపూర్ణ, రామనాథం, కోలం జ్యోతి, వెంకటేశ్వర్లు, షేక్‌గౌసియా బేగంకు నేతలు సిఎం పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, సిఎం కెసిఆర్, అఖిలేశ్ యాదవ్, డి రాజా కంటి అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం గురించి జాతీయ నేతలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు.

తొలి విడతగా 2018లో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రపంచంలోనే తొలి సామూహిక కార్యక్రమంగా గుర్తించినట్లుగా వివరించారు. ఈ కార్యకమాన్ని చూసిన డిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస గౌడ్, శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సిఎం చేతుల మీదుగా కలెక్టరేట్ ప్రారంభం

ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతోపాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరాయ్ విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్‌తోపాటు యూపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ నేత డి రాజలు బుధవారం ప్రారంభోత్సవం చేశారు.
సిఎం కెసిఆర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ గురించి జాతీయ నేతలకు సిఎం కెసిఆర్ వివరించారు. ఆ తర్వాత కలెక్టరేట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లాలో మంజూరు అయిన ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కూడా ఇక్కడే శంకుస్థాపన చేశారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్ వి.పి. గౌతమ్‌ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News