Friday, April 19, 2024

సినిమాపై అంచనాలు పెంచిన ‘క‌ప‌ట‌ధారి’ టీజర్..

- Advertisement -
- Advertisement -

Kapatadhaari movie Teaser Released by Rana

సుమంత్ తాజాగా న‌టిస్తోన్న క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ‘క‌ప‌ట‌ధారి’. సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం, ఇదంజ‌గ‌త్ చిత్రాల విజ‌యాల‌తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సుమంత్ ఆచితూచి చిత్రాలను ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా క‌న్న‌డంలో మంచి విజయం సాధించిన ‘కావ‌లుధారి’సినిమాను తెలుగులో రిమేక్ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ను హీరో రానా దగ్గుబాటి ట్వీట్టర్ వేదికగా విడుదల చేశాడు. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీని డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి తెరకెక్కించారు. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తున్నారు.

Kapatadhaari movie Teaser Released by Rana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News