Saturday, April 20, 2024

కోలుకుంటున్న కపిల్‌దేవ్

- Advertisement -
- Advertisement -

Kapil Dev recovering from heart attack

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ గుండెపోటుకు గురయిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని మాజీ క్రికెటర్ చేతన్ శర్మ తెలియజేశాడు. ఆస్పత్రిలో కపిల్ దేవ్ తన కూతురు ఆమ్మాతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఆయన ఈ విషయాన్ని తెలియజేశాడు. అంతకు ముందు కపిల్ కూడా తన ట్విట్టర్ ద్వారా క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెంది తనపట్ల ప్రేమను చూపించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా కపిల్‌దేవ్ సారథ్యంలో టీమిండియా తొలిసారిగా 1983లో ప్రపంచ కప్‌ను అందుకున్న విషయం తెలిసిందే.

Kapil Dev recovering from heart attack

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News