Thursday, April 25, 2024

నా భర్తను జైలుకు తరలించండి

- Advertisement -
- Advertisement -

Kappan's wife requests CJI to move my husband to jail

సిజెఐ కి కప్పన్ భార్య వినతి

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్‌కు వస్తున్నప్పుడు అరెస్టయిన తన భర్తను వెంటనే ఆస్పత్రి నుంచి జైలుకు తరలించాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణను కప్పన్ భార్య రైహంత్ కప్పన్ వేడుకున్నారు. కప్పన్ ఆస్పత్రిలో చాలా క్లిష్టపరిస్థితిలో ఉన్నారని, ఆయన ముఖంపై చాలా గాయాలయ్యాయని, ఆస్పత్రిలో మంచానికి గొలుసులతో కట్టేశారని అని ఆమె సిజెఐకి రాసిన లేఖలో వేడుకున్నారు. కప్పన్‌కు ఆస్పత్రిలో ఉండడం ఎంతమాత్రం ఇష్టం లేదని, ఆస్పత్రి లోనే ఉంటే తాను చనిపోయే ప్రమాదం ఉందని అతడే తన భార్యకు స్వయంగా చెప్పాడని న్యాయవాది మాథ్యూ తెలిపారు. కప్పన్ ప్రస్తుతం మధుర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News