Home తాజా వార్తలు అదే నా గ్లామర్ రహస్యం

అదే నా గ్లామర్ రహస్యం

sun salutations

 

హృతిక్ సరసన ‘కహోనా ప్యార్ హై’ చిత్రంలో కరీనాకపూర్ నటించాల్సింది. కానీ అభిషేక్ బచ్చన్ సరసన ‘రెఫ్యూజీ’లో నటించి సినీ రంగ ప్రవేశం చేసింది కరీన. హృతిక్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొడితే అభిషేక్ సినిమా అట్టర్ ఫ్లాపైంది. అయితే ఈ ఫలితం బెబో సినీ కెరీర్‌ను తలకిందులు చేయలేదు. దాదాపు 17 ఏళ్లుగా కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉంది. కెరీర్‌లో పీక్స్‌కు వెళ్లింది. టాప్ హీరోయిన్‌గా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. ఇప్పటికీ కెరీర్‌పరంగా ఢోకాలేని హీరోయిన్‌గా కొనసాగుతోంది. కెరీర్‌లో ఇద్దరు హీరోలతో కరీనా ఎఫైర్ సాగించిందని వార్తలొచ్చాయి. ఒకరు హృతిక్ రోషన్‌కాగా మరొకరు షాహిద్ కపూర్. చివరికి సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్‌తో ప్రేమాయణం కొనసాగించి అతన్నే పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన ఆమెకు తైమూర్ అలీఖాన్ పటౌడి అనే బాబు పుట్టాడు. అనంతరం మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. యంగ్ హీరోయిన్లకు ధీటుగా తిరిగి ఫిట్‌నెస్ సంపాదించి సినిమాలు చేస్తోంది. రెఫ్యూజీ సినిమాలో ఎలా కనిపించిందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అయితే తన గ్లామర్ సీక్రెట్ చెప్పింది బెబో. నిత్యం సూర్య నమస్కారాలు చేయడం ఆ రహస్యమని పేర్కొంది. 50 సూర్య నమస్కారాలు ఏకధాటిగా చేసేస్తుందట ఈ భామ. దీంతో పాటు డైటింగ్ కూడా చేస్తూ మెరుపుతీగలా మారింది కరీనాకపూర్.

Kareena says my glamor secret is doing sun salutations