Saturday, April 20, 2024

మహిళతో అసభ్య ప్రవర్తన.. ఆ జిల్లా బిజెపి అధ్యక్షుడిపై వేటు

- Advertisement -
- Advertisement -

Karimnagar BJP president suspended

 

హైద‌రాబాద్ : ఆయన ఓ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు. ఆ విషయం మరిచి ఓ మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. క‌రీంన‌గ‌ర్ జిల్లా బిజెపి పార్టీ అధ్య‌క్షుడు బాస స‌త్య‌నారాయ‌ణ‌ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో బాధ్య‌తగా మెల‌గాల్సింది పోయి, అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించి అడ్డంగా దొరికి పోయాడు. దీంతో స‌త్య‌నారాయ‌ణ‌ను బిజెపి రాష్ట్ర అగ్ర నాయ‌క‌త్వం సస్పెండ్ చేసింది. నూత‌న అధ్య‌క్షుడిగా గంగాడి కృష్ణారెడ్డిని నియ‌మిస్తూ బిజెపి రాష్ర్ట అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.   బిజెపిలో క్రియాశీల‌కంగా ప‌ని చేస్తున్న ఓ మ‌హిళా కార్య‌క‌ర్త‌ను బాస స‌త్య‌నారాయ‌ణ శారీర‌కంగా లొంగ‌దీసుకున్నట్లు తెలుస్తోంది. ప‌ద‌వులు రావేమోన‌నే భ‌యంతో ఆయ‌న ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎక్క‌డికి అంటే అక్క‌డికి ఆమె వెళ్లిన‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలో ఎన్నికల వేళ వీరిద్ద‌రూ స‌న్నిహితంగా ఉన్న వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కావ‌డంతో బిజిపి అగ్ర నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News