Home కరీంనగర్ కరీంనగర్ సిపికి ఆరునెలల జైలు శిక్ష.. జరిమాన

కరీంనగర్ సిపికి ఆరునెలల జైలు శిక్ష.. జరిమాన

CP-kamalhasan-reddyకరీంనగర్: కోర్టు ధిక్కరణ కేసులో కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సిపి) కమలాసన్ రెడ్డితో పాటు, ఎసిపి తిరుపతి, కరీంనగర్ రూరల్ ఎస్ హెచ్ వో శశిధర్ రెడ్డికి జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. అప్పీల్ కు వెళ్లడానికి నాలుగు వారాలపాటు తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి స్థానిక పుష్పాంజలి రిసార్ట్స్ లోకి పోలీసులు వెళ్లడంపై కేసు నమోదు అయింది. పోలీసులు తన రిసార్ట్స్ లోకి వచ్చి రమ్మీ ఆడుతూ.. తమను వేధిస్తున్నారని మాజీ ఎంఎల్ఎ జగపతిరావు గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు పోలీసులకు పలు సూచనలు చేసింది. అయిన సదరు పోలీసులు వాటిని ఉల్లంఘించారు.

Karimnagar CP Kamalasan Reddy Sentenced to Jail