Wednesday, April 24, 2024

కరీంనగర్‌ సిపి కమలహాసన్‌ రెడ్డి బదిలీ..

- Advertisement -
- Advertisement -

Karimnagar CP Kamalasan Reddy transferred

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపిఎస్ అధికారులను మంగళవారం బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈక్రమంలో కరీంనగర్ సిపిగా విధులు నిర్వర్తిస్తున్న కమలాసన్ రెడ్డి స్థానంలో రామగుండం పోలీస్ కమిషనర్ వెలవెల సత్యనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమలాసన్ రెడ్డిని డిజిపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఈ మేరకు ప్రభుత్వం సర్య్కులర్‌ను జారీ చేసింది. 2006 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన వెలవెల సత్యనారాయణ నగరంలోని వెస్ట్‌జోన్, సౌత్ జోన్‌లలో డిసిపిగా విధులు నిర్వర్తించిన అనంతరం పదోన్నతిపై రామగుండం సిపిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో సత్యనారాయణ గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నగర డిఎస్‌పి, మల్కాజిగిరి ఎసిపి, సిఎం కిరణ్‌కుమార్ హయాంలో చీఫ్ సెక్యూరిటీ అధికారిగా పనిచేశారు. అలాగే 2004 బ్యాచ్‌కు చెందిన వి. బి. కమలాసన్ రెడ్డి గతంలో సెంట్రల్ జోన్ డిసిపిగా పనిచేసి పదోన్నతిపై కరీంనగర్ సిపిగా విధులు నిర్వర్తించారు. కరీంనగర్ కొత్త సిపిగా రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణను ప్రభుత్వం నియమించగా, రామగుండం సిపిగా ఎసిబి జెడి రమణకుమార్‌ను నియమించింది. ప్రస్తుతం రమణకుమార్ ఎసిబి జాయింట్ డైరెక్టర్‌గా ఉన్నారు.

Karimnagar CP Kamalasan Reddy transferred

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News