Home కరీంనగర్ దసరకి డబుల్ బెడ్ రూం ఇండ్లను పేదలకు అందిస్తాం

దసరకి డబుల్ బెడ్ రూం ఇండ్లను పేదలకు అందిస్తాం

MLA Gangula Kamalakar

 

కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు డబుల్ బెడ్ రూంలను అందిస్తుందని కరీంనగర్ ఎంఎల్ఎ గంగుల కమలాకర్ అన్నారు.  కరీంనగర్ శివారు చింతకుంట గాంధీనగర్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం పనులను ఎంఎల్ఎ గురువారం పరిశీలించారు. కాంట్రాక్టర్లకు తగు సూచనలు, సలహాలు ఇచ్చి, అనంతరం ప్రతిష్టత్మకంగా నిర్మిస్తున్న అంభేద్కర్ భవన్, షాదీఖానా భవన నిర్మాణ పనులను దళిత నాయకులు, మైనార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేదల చిరకాల స్వప్నమైన డబుల్ బెడ్ రూం గృహ ప్రవేశాలను దసర రోజున చేపట్టి నిరుపేదలకు నీడనందిస్తామని తెలిపారు. పేద కుటుంబానికి స్వంత ఇంటి కల నిజం చేసేందుకు ముఖ్యమంత్రి కుసిఆర్ డబుల్ బెడ్ రూం పథకాన్ని ఆవిష్కరించారని గుర్తు చేశారు.

మొదటి ఫేజ్ లో 660, రెండవ ఫేజ్ లో 400ల డబుల్ బెడ్ రూం నిర్మాణాలను పూర్తి చేసి అందిస్తామన్నారు. సుమారు రెండు సంవత్సరాల పాటు భూమి కోసం ప్రయత్నించామని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డెయిరీ డెవలప్ మెంట్ నుండి పది ఎకరాల భుమీని అందించారని తెలిపారు. 1060 డబుల్ బెడ్ రూంలు, ఎకరం షాదీఖానా, ఎకరం అంభేద్కర్ భవన్ కు కేటాయించామని, అందుకు 100 కోట్ల నిధులతో విడుదలయ్యాయని అన్నారు. ప్రతి టవర్ లో రెండు లిప్ట్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే రెండు సంవత్సరాల లోపు వేయి డబుల్ బెడ్ రూం ఇళ్లను అందించనున్నామన్నారు. తెలంగాణాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అంబేడ్కర్ భవన్, షాదీఖానా పనులు తుది దశకు వచ్చాయని, ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ రమేష్, మాజి ఎంపిపి వాసాల రమేష్, కార్పొరేటర్లు వై. సునిల్ రావు, బండారి వేణు, ఎవి రమణ, సంసాల శ్రీనివాస్. టిఆర్‌ఎస్ నాయకులు చల్లా హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Karimnagar MLA visits double bedroom houses works