Home కరీంనగర్ కలిసొచ్చే కరీంనగర్!

కలిసొచ్చే కరీంనగర్!

trs

*రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు
*భావి తరాల కొరకు ప్రణాళికలు
*యాసంగి నుంచి మద్దతు ధర
*కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం
*రైతు సమితి వేదికకు భూవిరాళాలు
*పంట పెట్టుబడి సాయాన్ని వదులుకున్న
మంత్రులు
*రైతు సమన్వయ సమితి సభ్యులకు శిక్షణ
*రైతులతో సిఎం కెసిఆర్ ముఖాముఖి

కరీంనగర్ నుంచే తెలంగాణ తెచ్చామని అదేవిధంగా రైతు సమన్వయ సమితి ఏర్పాటు వలన రైతులకు సరైన న్యాయం జరుగుతుందని, దీంతో రైతే రాజు  అవుతాడని సిఎం కెసిఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లాకు 4 జీవధారాలు సజీవంగా ఉన్నాయని,1) ఎగువ మానేరు, దిగువ మానేరు, 2) వరద కాలువ 1 1/2 టి.ఎం.సి.లు 365 రోజులు నిలువ ఇండేలా,3) కాకతీయ కాలువ మరొక  జీవనాధారమని ఉత్తర గోదావరి మరొక జీవనాధారమని చెరువులన్నీ ఎస్‌ఆర్‌ఎస్‌పితో నింపుతామని చెరువులను ఎప్పుడు ఎండనియ్యమని సిఎం అన్నారు.హరితహారంను సీరియస్‌గా తీసుకొని గ్రామ శివారు మరియు రోడ్డు పక్కల చెట్లు బాగా పెంచాలని  మన పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేయాలని అదే శాశ్వత మార్గమని సిఎం అన్నారు.
మనతెలంగాణ/కరీంనగర్‌టౌన్: కరీంనగర్ నుంచే తెల ంగాణ చేచ్చామని అదేవిధంగా రైతు సమన్వయ సమితి ఏ ర్పాటు వలన రైతులకు సరైన న్యాయం జరుగుతుందని, దీ ంతో రైతే రాజు అవుతాడని సిఎం కెసిఆర్ అన్నారు. సోమవారం కరీంనగర్‌లో జరిగిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సులో మధ్యాహ్నం ముఖాముఖిలో ఖమ్మం జిల్లా ఇల్లందు నుంచి సీతక్క పామాయిల్ ప ంటకు సబ్సిడీ ఇస్తారా అని అడుగగా తప్పకుండా ఇస్తామ ని సిఎం.అన్నారు. కరీంనగర్ జి ల్లాకు 4జీవధారాలు సజీవంగా ఉన్నాయని,1)ఎగువ మా నేరు, దిగువ మానేరు ,2) వరద కాలువ 1 1/2 టి ఎంసిలు 365 రోజులు నిలువు వు ండేలా, 3) కాకతీయ కాలువ మరొక జీవధారయని ఉత్తర గోదావరి మరొక జీవధారయని చెరువులన్నీ ఎస్‌ఆర్‌ఎస్‌పి తో నింపుతామని చెరువులను ఎ ప్పుడు ఎండనియ్యమని సిఎంఅన్నారు.

కోతులు, అడవి పందులు పంట నష్టం పరుస్తున్నయని తెలుపగా పక్షులు, జంతువులు తిన్న చెట్లను వి రివిగా పెంచాలని,హరితహారంను సీరియస్‌గా తీసుకొని గ్రామ శివారు మరియు రోడ్డు పక్కల చెట్లు బాగా పెంచా ల ని మన భవిష్యత్తు పిల్లల కోసం కృషి చేయ్యాలని అదే శా శ్వత మార్గమని సిఎం అన్నారు. అడవి పందులను అరికట్టడానికి తుపాకీతో ఫైరు చేయవచ్చునని అన్నారు.రిజిస్ట్రేషన్ విధానంలో కూడా పెనుమార్పులు తీ సుకొస్తున్నామని తెలిపారు. రైతులకు రక్షణ కరువైందని, స మస్యల పరిష్కారం కోసం తెలంగాణ నుండే రైతు లడాయి మొదలుపెడతామని అన్నారు. కౌలు రైతులకు పెట్టుబడి సా యం అందించేది లేదని తేల్చి చెప్పారు. పామాయిల్, పండ్ల తోటలకు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. భావి తరా ల కోసం ప్రణాళికలు రూపొందించి ప్రాజెక్టులు, గిడ్డంగు లు తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. రైతు సమన్వయ సమితి సభ్యులకు శిక్షణ అందిస్తామని తెలిపా రు. అయిదు వేల ఎకరాలకు ఒక ఎఇఒను ఉంచామని తెలిపారు. పన్నెండు లక్షల ఎకరాలకు ఒకటి చొప్పున రైతు వేదికలను ఏర్పాటు చేస్తామన్నారు. స్థలం సేకరించడానికి అధికారులను ఆదేశిస్తున్నామని తెలిపారు. జూన్ నుంచి ప్రతి ఎకరంలో పంట తేవాలని అన్నారు. కల్తీ విత్తనాలు లేకుం డా చూసే బాధ్యత సమితి సభ్యులదేనని తెలిపారు. కల్తీ విత్తనాలు అమ్మిన వారిపై ఉక్కుపాదం మోపడమే కాకుండా పి డి. యాక్ట్ కూడా పెట్టడానికి కూడా వెనకాడడం లేదన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నా రు. ఏడాదికి రెండుసార్లు నేరుగా స్థానిక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి పంట పెట్టుబడి సాయం అందిస్తారని అన్నారు. రైతు లు అప్పులు లేకుండా ఉండాలని సమితిలను ఏర్పాటు చే యడం జరిగిందన్నారు.కాంగ్రెస్ ఆరోపణలు సరికావని అ న్నారు. సమైఖ్య రాష్ట్రంలో రైతులు దెబ్బ తిన్నారని, నీళ్లు రా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఐకమత్యంతో అన్నీ సాధించవచ్చన్నారు.రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే ప్ర భుత్వ లక్షం అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పా టు చేసిన రైతు సమన్వయ సమితి సదస్సు విజయవంతం అయ్యింది.పదిహేడు జిల్లాల నుంచి సమన్వయ సమితి స భ్యులు పాల్గొన్నారు.

రాష్ట్రఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ జిఎస్‌టిపై ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే కేంద్ర ంపై ఒత్తిడి తీసుకొనివచ్చి పరిష్కరిస్తామని తెలిపారు.
అనంతరం వ్యవసాయ శాఖామాత్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి కొంత మంది రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలుపుతూ పసుపు ఉడకపెట్టే యంత్రాలకు 50శాతం సబ్సిడీని 75శాతం సబ్సిడీకి పెంచాలని కోరగా అందుకు మం త్రి 75శాతం సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు.వరినాటు య ంత్రాలకు 2018-19 ఆర్ధిక సంవత్సరంలో భారీ ఎత్తున సబ్సిడీ ఇస్తామని ఒక్కొక్క మండలానికి 10 చొప్పున 5 వేల 5 వందల సబ్సిడీ యంత్రాలను ఇస్తామని మంత్రి అన్నారు. ఇటీవల వడగళ్ల వాన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిందని తెలుపగా వారికి ఇన్‌పుట్ సబ్సిడీ ఏర్పాటు చే స్తామని మంత్రి అన్నారు. టార్ఫాలిన్ 50 శాతం ఇస్తున్న సబ్సిడీని 70 శాతం పెంచుతామని మంత్రి అన్నారు.
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామాత్యులు హరీశ్‌రావు కొ ంత మంది రైతులు అడిగిన ప్రశ్నలకు కడెం ప్రాంతం ను ంచి కడెం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని కోరగా అందుకు మ ంత్రి సమాధానం ఇస్తూ కడెం ప్రాజెక్టు వైల్ఖ్ లైవు అనుమతులు అటవీ బీమా ఇబ్బందులున్నాయని అందుకు కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని మంత్రి తెలిపారు. శాశ్వత పరిష్కారం కుప్టి ప్రాజెక్టు అని 8 వందల కోట్ల రూపాయలతో కుప్టి ప్రాజెక్టు నిర్మించి శాశ్వతంగా పరిష్కరిస్తామని అన్నారు. మంచిర్యాల జిల్లాలో మా మిడి కాయల మార్కెటు ఏర్పాటు చేయమని కోరగా బెల్లంపల్లి, జగిత్యాల జిల్లాలో మామిడి కాయ మార్కెట్లు వున్నాయని మంత్రి తెలిపారు.
గోదాంలు, కోల్డ్ స్టోరేజీల గురుంచి రైతులు అడిగిన ప్రశ్నలకు 356 మండలాలలో కొత్త గోదాములు కడతామని, కొ త్త మండల కేంద్రాలలో కూడా భూమిని సేకరించి గోదాములు కడతామని మంత్రి అన్నారు. మొదటి దశలో 100 కోట్లతో 10కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తామని మంత్రి తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి ద్వారా చెరువులు నింపమని కోరగా వరద కాలువల ద్వారా చెరువులు నింపుతామని మంత్రి అన్నారు. కాళేశ్వరం నుంచి చల్లా నారాయణ రెడ్డి 14 చెరువులు మొ త్తం నింపాలని కోరగా అందుకు మంత్రి ఎన్ని చెరువులు సాంకేతికంగాఅవసరం వుంటే అన్ని చెరువులు నింపుతామని అన్నారు. మామిడి తోట రైతు సిరిసిల్ల జిల్లా నుంచి ఎ కరానికి రెండు పంటలకు 8వేలు ఇస్తారా అని అడుగగా ఇస్తామని మంత్రి అన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట నుండి నారాయణ ఎరువులు, సూక్ష్మ సేద్యం పరికరాలపై జిఎస్‌టి. ప్రభావం చాలా పడిందని తెలుపగా అందుకు రా ష్ట్ర ఆర్ధిక, పౌర సరఫరాల శాఖామాత్యులు ఈటెల రాజేందర్ సమాధానం ఇస్తూ జిఎస్‌టి. వచ్చిన తరువాత కొన్ని కొన్నిటికి 18 శాతం వుండేది, జిఎస్‌టి.ని 12 శాతం తగ్గించామని మంత్రి తెలిపారు. అనంతరం ధనవంతులైన కొంత మంది రైతులు,మంత్రులు, ఎంపి.లు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పంట పెట్టుబడి అవసరము లేదని ప్రకటించినారు. రైతు వేదికల నిర్మాణము కోసం చాలా మంది దాతలు భూములను విరాళాలను ప్రకటించారు.
పంట పెట్టుబడి సాయాన్ని వదులుకున్న మంత్రులు
కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సదస్సులో ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సాయాన్ని వదులుకుంటున్నట్లు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్‌రా వు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, కరీంనగర్ ఎ మ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపిలు బాల్క సుమన్, కవిత, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రకటించారు.
రైతు వేదికలకు పలువురి భూమి విరాళం
కరీంనగర్‌లో జరిగిన రైతు సమన్వయ సమితి సదస్సులో ఉత్తర తెలంగాణ నుండి వచ్చినటువంటి పలువురు రైతు స మన్వయ వేదికలకోసం తమ భూమిని సిఎం సమక్షంలో విరాళంగా అందించారు. ఈ సందర్భంగా సిఎం వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.
కరీంనగర్ నుంచే రైతు బీమాకు శ్రీకారం
కరీంనగర్ గడ్డ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చామని, ఇదే గడ్డపై నుంచి డ్బ్బై లక్షల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని ప్రకటించారు. రైతులకు 5 లక్షల ప్రమాద బీమా వచ్చే విధంగా ప్రభుత్వమే ఫ్రీమియం చెల్లిస్తుందని, అందుకు మంత్రి ఈటెల రాజేందర్‌ను ఆదేశించారు. అం దుకు మంత్రి ఈటెల తగిన నిధులు కేటాయించి ఫ్రీమియం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రైతులు అనారోగ్యమునకు గు రైనా, చనిపోయినా ఈ ప్రమాద బీమా వర్తిస్తుందని అన్నా రు. రాష్ట్రంలోని 70లక్షల మంది రైతులకు ఈ బీమా పథ కం వర్తిస్తుందని తెలిపారు.
ఈ అవగాహన సదస్సులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడి యం శ్రీహరి, శాసన సభాపతి సిరికొండ మధుసూధనా చా రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, సీ.యం. కార్యాలయ పు ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ట్రైనీ కలెక్టర్ ప్రావీణ్య,నగరపాలక సంస్థ కమీషనర్ శశాంక, జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్, కల్వకు ంట్ల కవితా,బాల్క సుమన్,ఏ.సీతారాం నాయక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జి.నగేష్, జడ్‌పి చైర్ పర్సన్ తుల ఉమ, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారధి చై ర్మన్ రసమయి బాలకిషన్, ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కె.కోటేశ్వర్ రావు, రాష్ట్ర కెడిసిసి బ్యాంకు చైర్మన్ కొండూరి రవీందర్ రావు, శాసన మండలి సభ్యులు భానుప్రసాద్, సుధాకర్, నారదాసు ల క్ష్మణ్‌రావు, కరీంనగర్, చొప్పదండి శాసన సభ్యులు గం గుల కమలాకర్, బొడిగె శోభ, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సి.పార్థసారథి, వ్యవసాయ పరిశోధన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రవీణ్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమీషనర్ జగన్మోహన్, ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకటరామిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల చారీ, నగర మేయర్ రవీందర్ సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, 17జిల్లాల నుంచి శాసన మండలి, శాసన స భ్యులు, జిల్లా చైర్‌పర్సన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సమన్వ య సమితి సమన్వయ కర్తలు తదితరులు పాల్గొన్నారు.