Home జాతీయ వార్తలు బెంగళూరులో 14 నుంచి వారం రోజులు లాక్‌డౌన్

బెంగళూరులో 14 నుంచి వారం రోజులు లాక్‌డౌన్

Karnataka CM says lockdown in Bengaluru from July 14

 

బెంగళూరు : బెంగళూరులో ఈనెల 14 రాత్రి 8 గంటల నుంచి 23 వరకు లాక్‌డౌన్ విధిస్తూ కర్నాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అత్యవసర సర్వీసులు మాత్రం యధావిధిగా కొనసాగుతాయి. కరోనా ఉధృతి కారణంగా ఈనెల 4న 33 గంటలపాటు లాక్‌డౌన్ విధించారు. కర్నాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప శుక్రవారం హోమ్ క్వారంటైన్‌కు వెళ్లారు. బెంగళూరు లోని ఆయన ఆఫీస్ కమ్ రెసిడెన్స్‌ను కూడా సిబ్బందిలో కొందరికి కరోనా సోకడంతో మూసివేశారు. ఐదు రోజులపాటు కార్యాలయాన్ని శానిటైజేషన్ కోసం మూసివేశారు.

Karnataka CM says lockdown in Bengaluru from July 14