Saturday, April 20, 2024

కర్నాటక కేబినెట్ విస్త’రణం’.. యడ్యూపై రగులుకున్న అసమ్మతి

- Advertisement -
- Advertisement -

కర్నాటక కేబినెట్ విస్తరణం
యడ్యూపై రగులుకున్న అసమ్మతి
ఎమ్మెల్సీలకు అందలంపై నిరసన
పిఎం మోడీ జోక్యానికి ఎమ్మెల్యేల వినతి

బెంగళూరు: కర్నాటకలో కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పట్ల అసంతృప్తి, అసమ్మతికి దారితీసింది. రాష్ట్ర మంత్రివర్గంలోకి యడ్యూరప్ప ఏడుగురు మంత్రులను కొత్తగా తీసుకున్నారు. వీరు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. వీరితో రాజ్‌భవన్‌లో గవర్నర్ వజ్జూభాయ్ వాలా ప్రమాణం చేయించారు. సిఎం, ఆయన మంత్రివర్గ సభ్యులు, పార్టీ కార్యవర్గ సభ్యులు, కర్నాటక బిజెపి వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్‌సింగ్, ఇతర నేతలు ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చారు. రాష్ట్రంలో యడ్యూరప్ప నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం 2019 జులైలో ఉనికిలోకి వచ్చింది. అప్పటి నుంచి చూస్తే ఇప్పటి మంత్రివర్గ విస్తరణ మూడవది. ప్రస్తుత ప్రమాణస్వీకార ఘట్టం బాగానే జరిగినా, ముఖ్యమంత్రి కొత్తగా తీసుకునే మంత్రుల పేర్ల జాబితాను వెలువరించగానే పార్టీలో అసంతృప్తి చెలరేగింది. ముఖ్యమంత్రి కేబినెట్ విస్తరణలో ఎమ్మెల్సీలను మంత్రులుగా తీసుకోవడంపై నిరసన వ్యక్తం అయింది. ప్రజలు నేరుగా ఎన్నుకోకుండానే చట్టసభలలోకి వచ్చే మండలి సభ్యులను మంత్రులుగా చేయడం అనుచితం అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు బహిరంగంగానే విమర్శించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు సరైన కాదు కదా నామమాత్రపు ప్రాతినిధ్యం కూడా లేదని, చాలా మంది బెంగళూరు, బెలగావి జిల్లాలకు చెందిన వారే ఉంటున్నారని, పార్టీలో సీనియర్లకు, పార్టీ కోసం త్యాగాలు చేసి వారికి సిఎం ఇప్పటికి మొండిచేయి చూపడం బాగాలేదని అసంతృప్తి వ్యక్తం అయింది. పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు నిరసనలకు దిగుతున్నారు. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార ఘట్టం దశ నుంచే నిరసనల పర్వం జోరుందుకుంది.

సిఎం కొందరికే అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని, ఆయన బ్లాక్‌మొయిల్‌కు లొంగిపోతున్నాడని విజయపురా సిటి ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ విమర్శించారు. సీనియార్టీ, పార్టీ పట్ల విధేయతలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సిఎం ఆయన కుటుంబం రాష్ట్రంలోని బిజెపిని హైజాక్ చేసిందని మండిపడ్డారు. వెంటనే ఇక్కడి పరిణామాలపై ప్రధాని మోడీ జోక్యం చేసుకుని, ఇక్కడి యడ్యూ కుటుంబ పాలనను అంతమొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బ్లాక్‌మొయిల్‌కు దిగే వారిని వారి చరిత్ర గురించి పట్టించుకోకుండానే ముఖ్యమంత్రి మంత్రులుగా తీసుకుంటున్నారని, దీనితో పార్టీ చివరికి ఏ గతి పాలవుతుందో అని భయంగా ఉందని ఈ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. సిఎం కుటుంబసభ్యుల అవినీతికి సంబంధించిన సీడిలతో కొందరు ఆయనను బ్లాక్‌మొయిల్ చేస్తున్నారని, దీనితో వారి వారికే మంత్రి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. యడ్యూరప్ప హయాంలో తాను మంత్రిని కాదల్చుకోలేదని, అయితే పార్టీని రక్షించడం బాధ్యత అని తేల్చిచెప్పారు. ‘యడ్యూరప్పకు మకర సంక్రాంతి ముందు సవాలు విసురుతున్నానని, ఆయన రాజకీయ అంతం ఉత్తరాయణ కాలం నుంచి ఆరంభం అవుతుందని, కర్నాటకలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కొత్త దశ ఆరంభం అవుతుందని తెలిపారు.

Karnataka CM Yediyurappa Expansion Cabinet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News