Monday, June 23, 2025

మాకేం సంబంధం.. తొక్కిసలాట ఘటనపై కర్ణాటక క్రికెట్‌ బోర్డు

- Advertisement -
- Advertisement -

చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక క్రికెట్‌ బోర్డు(కెఎస్‌సిఏ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ ఘటనతో మాకేం సంబంధమని పేర్కొంది. కేవలం కర్ణాటక ప్రభుత్వం, ఆర్సీబీ యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని చెప్పింది. అభిమానులను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారని.. తొక్కిసలాటతో మాకు సంబంధం లేదని కెఎస్‌సిఏ చెప్పింది.

కాగా, ఆర్సీబి విజయోత్సవ ర్యాలీ సందర్భంగా భారీగా తరలివచ్చిన అభిమానులు ఒక్కసారిగా తోసుకుంటూ చిన్నస్వామి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News