Friday, April 19, 2024

ఐదు గ్యారంటీలపై రేపు ప్రకటన చేయనున్న కర్నాటక ప్రభుత్వం!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఎన్నికల ప్రచార సందర్భంలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను అమలు చేస్తానని హామీ ఇచ్చింది. కాగా ఇప్పుడు ఆ హామీలు అమలు చేయాలంటూ కర్నాటకలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం క్యాబినెట్ సమావేశ అనంతరం వీటికి సంబంధించిన ప్రకటన రావచ్చని అభిజ్ఞవర్గాల భోగట్టా. వచ్చే వారం నుంచి వాటిని అమలు చేయనున్నట్లు ప్రకటన వచ్చే సూచన ఉందని ఆ వర్గాలు తెలిపాయి.

హామీల అమలు నాడు లేక ఒక రోజు ముందు పెద్ద పబ్లిక్ ర్యాలీని కూడా పార్టీ నాయకత్వం చేపట్టనున్నది. పార్టీకి చెందిన ప్రధాన నాయకులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారని సమాచారం. ప్రస్తుతం రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో హామీల విషయంలో ఎలా ముందుకు సాగాలనే విషయంపై చర్చ జరుగుతోందని తెలిసింది.
అభిజ్ఞవర్గాల ప్రకారం శుక్రవారం మూడు గ్యారంటీలను అమలు చేయనున్నట్లు క్యాబినెట్ ప్రకటించవచ్చు. కేవలం పత్రికా సమావేశంతో పెద్దగా మైలేజీ రాదు కనుక పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలని పార్టీ మేధావులు భావిస్తున్నారని సమాచారం.
రేపు(జూన్ 2) గ్యారంటీ పథకాలపై క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి సి.ఎం.సిద్ధరామయ్య ప్రకటించారు. కాగా అధికారులు కొని ఆప్షన్లు ఇచ్చారని ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ తెలిపారు.

కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం సందర్భంలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చింది: అన్నభాగ్య పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలలోని ప్రతి సభ్యుడికి 10 కిలోల ఉచిత బియ్యం, గృహలక్ష్మి పథకం కింద కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న మహిళకు రూ. 2000, యువనిధి పథకం కింద రెండేళ్ల వరకు నిరుద్యోగ పట్టభద్రుడికి రూ. 3000 అలవెన్స్, నిరుద్యోగ డిప్లొమా హోల్డర్లకు రూ. 1500, మహిళలకు రాష్ట్రంలోని బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఉచితం.

హామీలతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, ఇప్పుడు వాటిని అమలు చేయకుండా తాత్సారం చేస్తోందని బిజెపి, జెడి(ఎస్) విరుచుకుపడుతున్నాయి. దీంతో కరాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే పథకాలకు సూత్రప్రాయంగా సిద్ధరామయ్య ఆమోదం తెలిపారని తాజా వార్త. సిద్ధరామయ్య బ్యూరొక్రాట్లతో అనేక సార్లు చర్చలు జరిపారు. ఉచితాలను అమలు చేయడం వల్ల సంవత్సరానికి రూ. 50000 కోట్లు ఖర్చు వస్తుందని అధికారులు ఆయనకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News