Home జాతీయ వార్తలు పెను తుపానుగా ‘క్యార్’

పెను తుపానుగా ‘క్యార్’

Kyar-Cyclone

ముంబై : క్యార్ తుపాన్ వచ్చే 24 గంటలలో తీవ్రస్థాయి పెను తుపాన్‌గా రూపాంతరం చెందుతుందని శనివారం వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావం ఇప్పు డు మహారాష్ట్రపై కొంత మేరకు పడుతుంది. అయితే దక్షిణ లోతట్టు కర్నాటక, తీర కర్నాటక, ఉత్తర అంతర్గత కర్నాటకలలో పలు చోట్ల సాధారణ నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఇక అరేబియా సముద్రంలో తూర్పు మధ్య ప్రాంతంలో వచ్చే 24 గంటలలో అలలు ఉధృతంగా లేస్తాయి. ఆ తరువాత కూడా ఈ పరిణామం కొనసాగుతుందని దేశ రాజధానిలోని ప్రధాన వాతావరణ విభాగం విశ్లేషించింది. ప్రత్యేకించి ఉత్తర కర్నాటక తీరం వెంబడి కల్లోల పరిస్థితి ఉంటుందని ఐఎండి వారు హెచ్చరికలు వెలువరించారు. క్యార్ తుపాన్ శుక్రవారం మహారాష్ట్రలోని రత్నగిరికి పశ్చిమాన 130 కిలోమీటర్లు, ముంబైకి దక్షిణ, ఆగ్నేయ దిశలో 330 కిమీల దూరంలో సముద్రంలో నెలకొంది. తుపాన్ నెమ్మదిగా పశ్చిమ ఉత్తర, వాయవ్య దిశగా పయనిస్తుంది.వచ్చే ఐదు రోజులలో ఇది ఒమన్ తీరం వైపు చేరుతుందని అంచనా వేశారు.

తూర్పు మధ్య అరేబియా సముద్రంలో తిష్టవేసుకుని ఉన్న క్యార్ తుపాన్‌ను దృష్టిలో పెట్టుకుని భారతీయ తీర రక్షణ దళం శనివారం నుంచి సముద్రంలో తీవ్రస్థాయి గాలింపు సహాయ చర్యలకు దిగింది. ఇప్పటికే ఈ దళానికి చెందిన విమానాన్ని తగు విధంగా రంగంలోకి దింపేందుకు సిద్ధంగా ఉంచారు. కోస్ట్ గార్డు ఎయిర్ ఎన్‌క్లేవ్‌లో ఇది పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమాయత్తం అయింది. సముద్రంలోకి వెళ్లిన జాలర్ల పడవలు చిక్కుపడి ఉంటే కాపాడేందుకు నౌకాదళ విమానాలు ఈ ప్రాంతంలో గగనతలంలో తిరుగుతున్నాయి. కర్నాటక గోవా తీరం వెంబడి కూడా భారత తీర రక్షక దళ నౌకలు సముందర్ ప్రహారీ , అమల్, అపూర్వ, అమర్తా, రాజ్‌దూత్‌లు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే 24 గంటలలో మత్సకారులు మహారాష్ట్ర గోవా కర్నాటక తీర దూర ప్రాంతం, ఉత్తర తూర్పు అరేబియా, సమీపంలోని దక్షిణ గుజరాత్ తీరంలోకి చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు వెలువరించారు.

karnataka on the red alert after kyar cyclone