Home తాజా వార్తలు ‘తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఏమీ చేయలేదు’

‘తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఏమీ చేయలేదు’

Karne Prabhakar, BJP Party

హైదరాబాద్: బిజెపి నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్ విమర్శించారు. సోమవారం కర్నె మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. విభజన హామీలపై పార్లమెంట్‌లో నిలదీసినా పట్టించుకోలేదని బిజెపి ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. ఓట్ల కోసమే బిజెపి నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, హైకోర్టును విభజించమంటే కేంద్రం పట్టించుకోవడం లేదని, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వడంలేదని విమర్శించారు. సిఎం అవుతానంటూ స్వామి పరిపూర్ణానంద పగటి కలలు కంటున్నాడని, ఆంధ్ర ప్రవచనాలను తెలంగాణ మీద రుద్దితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ చైతన్య ప్రాంతమని, స్వామి రాజకీయాలు ఇక్కడ నడవని, ఎన్నికలప్పుడే బిజెపికి రామమందిరం గుర్తుకు వస్తుందని, మత రాజకీయాలతో బిజెపి తెలంగాణలో ఓట్లు పడవని తెలిపారు. టిపిసిసి తన అధికార ట్విట్టర్‌లో అన్నీ అబద్ధాలే ప్రచారం చేస్తుందని, స్వాహా చేసే అలవాటు కాంగ్రెస్ నేతలకే ఉందని, అందుకే స్కామ్‌గ్రెస్‌గా మారిందని దుయ్యబట్టారు. మాహారాష్ట్ర మాజీ సిఎం పృధ్వీ రాజ్ చవాన్ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన స్క్రిప్టును చదివారని, చవాన్ నిజాలు తెలుసుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించరని పేర్కొన్నారు.

Karne Prabhakar Comments on BJP Party

Telangana news