Saturday, April 20, 2024

రేపు మళ్ళీ తెరుచుకోనున్న కర్తార్‌పూర్ సాహిబ్ నడవ 

- Advertisement -
- Advertisement -

Kartarpur corridor
న్యూఢిల్లీ: కర్తార్‌పూర్ నడవను 2019 నవంబర్‌లో తెరిచారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా ఆ కారిడార్‌ను 2020 మార్చిలో మూసేశారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలున్నాయి. దాంతో ఆ కారిడార్‌ను తిరిగి తెరవడం వల్ల రాజకీయ ఫలాలు దక్కే అవకాశం కూడా ఉంది. నవంబర్ 19న గురుపర్బ్. కనుక కేంద్రప్రభుత్వం కార్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను తిరిగి తెరవాలని నిర్ణయించుకుంది. ఈ నడవను తెరవడం వల్ల భారత్‌లోని సిక్కు యాత్రికులు పాకిస్థాన్‌లోని సిక్కుల పుణ్యస్థలిని సందర్శించుకునే అవకాశం ఉంటుంది. కేంద్రం తీసుకున ఈ నిర్ణయం ప్రధానంగా సిక్కు తీర్థయాత్రికులకు ప్రయోజనకరం కాగలదు. “ నవంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను తిరిగి తెరువనున్నారు” అని హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం ట్వీట్ చేశారు. అంతేకాక ఆయన “ఇది శ్రీ గురు నానక్ దేవ్‌జీ, ఆయన సిక్కు సముదాయం అంటే మోడీ ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో చాటుతోంది” అని తెలిపారు.
“ నవంబర్ 19న శ్రీ గురు నానక్ దేవ్ జీకి సంబంధించిన ప్రకాశ్ ఉత్సవ్ వేడుకలను దేశం జరుపుకుంటుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్తార్‌పూర్ కారిడార్‌ను తిరిగి తెరువడం వల్ల దేశవ్యాప్తంగా ఆనందం వెల్లివిరియగలదు” అని కూడా అమిత్ షా ట్వీట్ చేశారు. పంజాబ్ బిజెపి నాయకులు ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన రెండు రోజులకు ఈ సానుకూల నిర్ణయాన్ని తీసుకున్నారు. పంజాబ్ బిజెపి నాయకులు కారిడార్‌ను తిరిగి తెరవాలంటూ ప్రధానికి ఓ మెమోరాండంను కూడా సమర్పించారు. ఇదిలా ఉండగా కోవిడ్-19 నియమనిబంధనలు ఆ కారిడార్‌లో వెళ్లేవారికి వర్తిస్తుంది. ఎలాంటి మినహాయింపులు ఉండవు. అంటే డబుల్ వ్యాక్సినేషన్,సోషల్ డిస్టెన్సింగ్, 72 గంటల్లో ఆర్‌టి-పిసిఆర్ పరీక్షలు, తదితరములు వర్తిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News