హైదరాబాద్: తెలుగు, తమిళ భాషల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అకట్టుకుంటున్న హీరో కార్తీ. ఇటీవల ‘ఖాకీ‘ సిన్మాతో భారీ సక్సెస్ ను అందున్న కార్తీ, మరో సారీ రకుల్ తో కలిసి ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఈ ఇద్దరి జోడిలో రజత్ రవిశంకర్ ‘దేవ్’ చిత్రాన్ని చేశాడు. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది.
ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. లవ్…. రొమాన్స్ …. యాక్షన్…. ఛేజింగ్ సీన్స్ పై ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. కార్తీ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ స్టార్ట్ అవుతుంది. ‘ఈ లోకంలో బతకడానికి ఎన్నో దారులున్నాయి… ఎవరో చెప్పారని అర్థంగాని చదువు చదివి…. ఇష్టం లేని ఉద్యోగం చేసి…. ముక్కు మొహం తెలియని ఒక నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పడి పనిచేసి…. ఈగో…. ప్రెషర్…. కాంపిటేషన్లో ఇరుక్కుని…. అంటీ అంటనట్టు లవ్ చేసి…. ఏం జరుగుతుందో అర్థం కాకుండా బతకడం ఒకదారి. ఇంకోదారి వుంది..’ అంటూ తనకి నచ్చిన మార్గంలో కార్తీ దూసుకుపోవడం వంటి సీన్లను ఈ టీజర్లో చూపించారు. ప్రస్తుతం ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.