Home తాజా వార్తలు కార్తి ‘దొంగ’ మూవీ టీజర్ విడుదల

కార్తి ‘దొంగ’ మూవీ టీజర్ విడుదల

 

తమిళ స్టార్ హీరో కార్తి ప్రధాన పాత్రలో ఇటీవల వచ్చిన ‘ఖైదీ’ సినిమా సూపర్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత ప్రస్తుతం కార్తి, తన వదిన జ్యోతికతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కూడా మరోసారి మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘దొంగ’ టైటిల్ ను వాడుకుంటున్నారు. కార్తి, జ్యోతిక ప్రధాన పాత్రల్లో ‘దొంగ’ చిత్రాన్ని మలయాళ దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ని కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ చిత్రంలో జ్యోతిక, కార్తిలు ఈ సినిమాలో అక్కా తమ్ముళ్లుగా నటిస్తున్నారు. కాగా, తమిళంలో ‘తంబి’ టైటిల్‌తో విడుదల చేస్తున్న ఈ మూవీ టీజర్ ని హీరో సూర్య విడుదల చేయగా… మలయాళం టీజర్ ని మోహన్ లాల్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్: ఆర్ డి రాజశేఖర్.ఇక, ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు.

Karthi Donga movie teaser released