Home దునియా భక్తులను అనుగ్రహించే మాసం కార్తీకం

భక్తులను అనుగ్రహించే మాసం కార్తీకం

karthika-masam

నదీ స్నానాలు, దీప తోరణాలు, వన భోజనాలు, దానాలతో మానవ సమాజనంలోనూ మానవులను అనుగ్రహించడానికి, దేవతలలోనూ కూడా సమైక్యతను, నిరాడంబరతను, అద్వైతాన్ని, అభేదాన్ని కల్పించే కార్తీకం అన్ని మాసాల్లో గొప్పది. శివకేశవులిద్దరూ అద్వైతంగా, అన్యోన్యంగా పూజలందుకుంటూ భక్తులను అనుగ్రహించే మాసం ఒక్క కార్తీక మాసమే. విష్ణువు మారేడు దళాలను స్వీకరిస్తాడు. శివుడు తెల్ల జిల్లేడు పూలు తీసుకుంటాడు. విష్ణువు సాలగ్రామ అభిషేకాలు, శివుడు మృల్లింగాభిషేకాలు (మట్టితో చేసిన లింగం) అంగీకరిస్తారు.

వన భోజనాల్లో ఇద్దరినీ పూజిస్తారు. వృక్షాలు శివ, విష్ణు స్వరూపాలుగా పూజలందుకుంటాయి. ఈ మాసంలో సకల చరాచర సృష్టిలోనూ వారిద్దరూ కలిసి ఉంటారు. నదుల్లో, చెట్లలో, దీపాల్లో, వాయువులో, ఆకాశంలో, పంచభూతాల్లో అంతటా శివకేశవాద్వైతం కొలువుదీరి ఉంటుంది. కార్తీక పురాణం చివరి అధ్యాయంలో, కలియుగ మానవులు తక్కువ ప్రేమతో ఎక్కువ పుణ్యాన్ని, మోక్షాన్ని పొందవచ్చని వశిష్టుడు చెప్పాడు. కార్తీకంగా, దామోదర మాసంగా, ఊర్జమాసంగా మూడు పేర్లతో పిలిచే ఈ మాసం సమన్వయానికి సంకేతం.

karthika masam history in telugu