Wednesday, April 24, 2024

కార్తీ పౌర్ణమితో నగరంలో వెల్లువిరిసిన ఆధ్యాత్మిక శోభ

- Advertisement -
- Advertisement -

Karthika Pournami Celebrations in hyderabad

హైదరాబాద్: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని నగరవాసులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. నగరంలోని శైవ దేవాలయాలతో పాటు ప్రధాన ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. నగరమంతా ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసింది. పౌర్ణమి వెలుగులకు దివ్యల వెలుగులు కూడా తోడు కావడం నగరంతో దేదీపమణ్యంగా వెలిగిపోయింది. నగరవాసులు తెల్లవారు జామున మంగళ స్నానాలు ఆచరించి తమ ఇష్ట దైవాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఇళ్లల్లో నోములు వత్రాలను నిర్వహించుకున్నారు. పలు ఆలయాల్లో నగరవాసులు సామూహికంగా సత్యనారాయణ స్వామి వత్రాన్ని జరుపుకున్నారు. సికింద్రాబాద్‌లోని గణేష్ టెంపుల్‌లో సామూహిక వత్రాలు కన్నుల పండువగా జరిగాయి. ఆలయంలో జరిగిన సత్యనారాయణ స్వామి వత్రం కార్యక్రమంలో ఏకకాలంలో వందలాది మంది దంపతులు పాల్గొన్నారు. హిమాయత్‌నగర్‌లోని తిరుమల తిరుపతి దేవాలయం, బిర్లా మందిర్, బాలాజీ చిల్కూర్ ఆలయంతో పాటు నగరంలోని శివాలయాలు, మల్లిఖార్జున స్వామి ఆలయాల వద్ద సాయంత్రం వేళా పలు ఆలయాల్లో కార్తీక దీపాలు వెల్లిగించి మహిళలు తమ మొక్కులను తీర్చుకున్నారు. సాయంత్రం చిన్నారులు, యువత టపాసులతో సందడి చేశారు.

శైవ క్షేత్రాలకు తరలి వెళ్లిన నగరవాసులు 

కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని నగరవాసులు పెద్ద ఎత్తున ప్రసిద్ద శైవక్షేత్రాలకు తరలి వెళ్లారు. వేముల వాడ రాజన్న, కాలేశ్వరం, కొండగట్టు ఆంజనేయ స్వామి, ధర్మపురి లక్ష్మినరసింహా స్వామితోపాటు కొమురవెళ్లి మల్లీకార్జున స్వామి, యాద్రాది లక్ష్మి నర్సింహ్మా స్వామి, వరంగల్‌లోని ఐనవేలు, వేయి స్తంభాల దేవాలయం, పాలకుర్తి సోమేశ్వరాలయం, రామప్ప రామలింగేశ్వర ఆలయంలకు తరలి వెళ్లారు. గోదవరి నదిలో పుణ్య సాన్నాలు ఆచరించి ఆయా పుణ్యక్షేత్రాలతో పరమ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News