Home సినిమా సంక్రాంతికి ఆడియో

సంక్రాంతికి ఆడియో

కార్తి, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ‘దేవ్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. రాజత్ రవిశంకర్ ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘దేవ్’ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. సంక్రాంతి పండుగ కానుకగా సినిమా ఆడియోను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. చెన్నై, హిమాలయాలు, హైదరాబాద్, ముంబయ్‌లోని అందమైన ప్రదేశాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రజత్. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను సమర్పిస్తోంది. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, నిక్కీ గర్లాని, కార్తిక్ ముత్తురామన్, ఆర్‌జె విఘ్నేష్, రేణుక, అమృత, వంశీ, జయకుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః వేల్రాజ్, ఆర్ట్‌ః రాజీవన్, ఎడిటర్‌ః రూబెన్.

Karti’s Next Film DEV Movie Audio By Sankranthi Festival

Telagnana News