Saturday, April 20, 2024

బాలకృష్ణ చిన్నల్లుడికి భారీ షాక్…

- Advertisement -
- Advertisement -

Balakrisha-Son-In-Law

హైదరాబాద్ : టిడిపి నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత భరత్‌కు భారీ షాక్ తగలింది. భరత్ తండ్రి పట్టాభి రామారావు, చిన్నాన్న లక్ష్మణరావు, అతడి కుటుంబసభ్యులకు కరూర్ వైశ్యాబ్యాంక్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై భరత్ స్పందించకపోవడంతో ఏకంగా ఆస్తుల జప్తుకు బ్యాంకు సిద్ధమైంది. బ్యాంక్ దాదాపు రూ.124 కోట్ల 39 లక్షల 21 వేలు తిరిగి చెల్లించాలని, లేని పక్షంలో తాకట్టుపెట్టిన ఆస్తులను జప్తు చేస్తామని నోటీసులో బ్యాంకు పేర్కొంది.

టెక్నో యూనిట్ ఇన్‌ఫ్రాటిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భరత్ కుటుంబం వైజాగ్‌లోని గాజువాక, భీమిలిలోని భూములన తాకట్టుపెట్టి.. దాదాపు రూ.124 కోట్లకు పైగా డబ్బును అప్పుగా తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్టపివరకు వడ్డీ కూడా కట్టకపోవడంతో బ్యాంకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ అప్పును 21.01.2020 నాటికి కంపెనీ పేరిట తీసుకున్న వడ్డీతో కలిపి అసలు కూడా చెల్లించాలని నోటీసులో బ్యాంకు తెలిపింది. కాగా గతంలో ఆంధ్రాబ్యాంక్ విషయంలో కూడా భరత్‌పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.

 

Karur Vysya Bank Served Notices To Balakrisha Son In Law

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News