Home అంతర్జాతీయ వార్తలు పాక్ జాతి రక్తంలోనే కశ్మీర్: ముషారఫ్

పాక్ జాతి రక్తంలోనే కశ్మీర్: ముషారఫ్

Ex President Pervez

 

కశ్మీరీల కోసం పాక్ సైన్యం పోరాడుతుంది
స్పష్టం చేసిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు

ఇస్లామాబాద్: పాకిస్థాన్ జాతి రక్తంలోనే కశ్మీర్ ఉందని, ఏది ఏమైనా సరే! కశ్మీర్ ప్రజలకు మద్దతుగా తమ సైన్యం నిలబడుతుందని, వాళ్ల చివరి రక్తపు బొట్టు వరకు కశ్మీరీలకోసం పోరాడుతుందని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ స్పష్టం చేశారు. ఆయన ఇటీవల క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించారు. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న ముషారఫ్ కార్గిల్ యుద్ధాన్ని గుర్తు చేశారు. పాకిస్థాన్ ఎన్ని శాంతి ప్రయత్నాలు చేస్తున్నా భారతదేశం అదేపనిగా పాక్‌ను బెదిరిస్తోందని ఆరోపించారు. ‘భారత సైన్యం కార్గిల్ యుద్ధా న్ని మరచిపోయినట్టుంది.

1999లో ఆ సంఘర్షణకు ముగింపు పలికేందుకు ఇండియా అమెరికా అధ్యక్షుడి సహాయం తీసుకోవలసి వచ్చింది’ అని 76 ఏళ్ల ఆల్ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎపిఎంఎల్) ఛైర్మన్ వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో ఎపిఎంఎల్ స్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ కార్యకర్తల నుద్దేశించి దుబాయ్ నుంచి ఫోన్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో గత ఏడాది నుంచి ముషారఫ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆగస్ట్ 5న భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత భారత్‌పాక్ సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ముషారఫ్ మొదటిసారి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. శాంతికోసం పాకిస్థాన్ చేసే ప్రయత్నాన్ని బలహీనతగా భావించకూడదని ముషారఫ్ స్పష్టం చేశారు.

Kashmir is in Blood of Pakistan, Says Ex President Pervez