Home జాతీయ వార్తలు జమ్ము కశ్మీర్‌లో పర్యటనలపై నిషేధం తొలగింపు

జమ్ము కశ్మీర్‌లో పర్యటనలపై నిషేధం తొలగింపు

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లో గురువారం నుంచి పర్యాటకుల పర్యటనపై నిషేధం తొలగింది. లోయలో ఉగ్రవాదుల ముప్పు ఉందని చెబుతూ రెండు నెలల క్రితం పర్యాటకుల పర్యటనలను ప్రభుత్వం నిషేధించింది. గవర్నర్ సత్యపాల్ మాలిక్ కశ్మీర్ లోయలో ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సోమవారం సమీక్షించిన తరువాత నిషేధం ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దుకు ముందు ఆగస్టు 2న కేంద్ర ప్రభుత్వం అమర్‌నాధ్ యాత్రను రద్దు చేసింది. లోయలో పర్యటన కాలాన్ని తక్షణం తగ్గించుకోవాలని యాత్రికులను, పర్యాటకులను ఆదేశించింది. ఇదిలా ఉండగా బుధవారం హయ్యర్ సెకండరీ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు మళ్లీ ప్రారంభమయ్యాయి. శ్రీనగర్ లోని ప్రతిష్టాత్మక శ్రీ ప్రతాప్ కాలేజీ బయట భద్రతా దళాలు గస్తీ కాస్తున్నాయి. విద్యార్థుల గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన తరువాతనే క్యాంపస్ లోకి పంపిస్తున్నారు. అయితే ఇంకా తరగతులు మాత్రం ప్రారంభం కావడం లేదు. సాధారణ పరిస్థితి పూర్తిగా నెలకొన్న తరువాతనే తరగతులు ప్రారంభిస్తామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Kashmir Valley Opened for Tourists After 2 Months Ban