Home తాజా వార్తలు పెళ్లి వదంతులు ఖండించిన కత్రీనా కైఫ్

పెళ్లి వదంతులు ఖండించిన కత్రీనా కైఫ్

katrina
ముంబయి: నటీనటులు కత్రీనాకైఫ్, విక్కీ కౌశల్(సూర్యవంశీ సినిమా నటుడు) ముంబయిలో మంగళవారం రాత్రి కలిసి కనిపించేసరికి వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వదంతులు వ్యాపించాయి. వారిద్దరూ ఇదివరలో కూడా చాలా సార్లు అనేక చోట్ల కలిసి కనిపించారు. దాంతో పుకార్లు పుట్టించేవారు వారి పెళ్లి డిసెంబర్‌లో జరగనుందని మరింత మసాలా పులిమేసారు. అయితే వారిద్దరూ తమ సంబంధం గురించి ఏ మాత్రమూ పెదవి విప్పలేదు. వారిద్దరూ రెండు వేర్వేరు కార్లలో వెళ్లారు. పపరాజీలు వారి పెడగా చేయి ఊపుతూ చిరునవ్వులు మాత్రం చిందించారు. కానీ వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండి ఉంటుందన్న విషయంలో చాలా మందిలో కుతూహలం చోటుచేసుకుంది. కొందరు విలేకరులు వారిద్దరూ డిసెంబర్‌లో పెళ్లిచేసుకోబోతున్నారా అని అడుగగా కత్రీనా కైఫ్ దానిని ఖండించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు బాలీవుడ్ జీవితంలో మామూలేనంది. ‘నా పెళ్లి ప్రశ్న గురించి గత 15 సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నారు’ అని కూడా ఆమె అంది.